Published : 29/12/2020 01:22 IST

క్రికెట్లో రెండు రకాల మనుషులుంటారు: అమిత్‌ షా

అరుణ్ జైట్లీ రెండో వర్గం వారన్న కేంద్ర మంత్రి

ఇంటర్నెట్‌ డెస్క్‌: దిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా స్టేడియంలో దివంగత అరుణ్‌జైట్లీ విగ్రహాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆవిష్కరించారు. క్రికెట్‌కు ఆయన చేసిన సేవలను కొనియాడారు. ‘క్రికెట్లో రెండు రకాల మనుషులు ఉంటారు’ అని బిషన్‌సింగ్‌ బేడీ వివాదాన్ని ఉద్దేశిస్తూ అన్నారు. మొదటి వర్గం వారు మైదానంలో ఆడతారని, రెండో వర్గం వారు క్రికెటర్లకు అవసరమైన వాతావరణం, మౌలిక సదుపాయాలు కల్పించడంలో సాయపడతారని పేర్కొన్నారు. వారు చేసిన సేవలకూ ఎంతో విలువ ఉంటుందని, అందుకే జైట్లీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు.

కొన్నేళ్లుగా రెండురకాల కార్యక్రమాలు భారత క్రికెట్‌కు దశ, దిశ చూపిస్తున్నాయని అమిత్‌ షా అన్నారు. అందులో మొదటిది మ్యాచు హక్కులను విక్రయించడం, రెండోది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ అని తెలిపారు. ‘ఐపీఎల్‌ను పరిగణనలోకి తీసుకోవాల్సి వచ్చినప్పుడు నాలాంటి వాళ్లు దూరంగా ఉండి గమనించారు. రెగ్యులర్‌ మ్యాచులు, లీగల్‌ ఫ్రేమ్‌వర్క్‌పై మా మదిలో ప్రశ్నలు తలెత్తేవి. అప్పుడు నేను జైట్లీతో మాట్లాడేవాడిని. ఆయనే అన్ని సందేహాలూ తీర్చారు’ అని షా పేర్కొన్నారు.

దివంగత జైట్లీ ఎంతో నమ్మకం, ఆత్మవిశ్వాసంతో తమ సందేహాలు తీర్చారని అమిత్‌షా తెలిపారు. ‘జైట్లీ ఎప్పుడూ తెర వెనకే ఉన్నారు. కానీ ఆయనే సమస్యలను పరిష్కరించి గందరగోళాన్ని నివారించారు. అన్నింటినీ పక్కనపెట్టి ప్రజలు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకొనే అవకాశం కల్పించారు. ఒకప్పుడు క్రికెట్‌ను కెరీర్‌గా భావించేవారే కాదు. కానీ ఇప్పుడు దాంట్లోనే జీవితాన్ని వెతుక్కుంటున్నారు. నేను కష్టాల్లో ఉన్నప్పుడూ  జైట్లీజీ పెద్దన్నలా నా వేలుపట్టుకొని నన్ను నడిపించారు’ అని షా వెల్లడించారు.

ఇవీ చదవండి
ధోనీకి అవార్డు తెచ్చిన సంఘటన ఇదే!
కోహ్లీ, ధోనీకి ప్రతిష్ఠాత్మక అవార్డులు


Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని