సచిన్ భాయ్.. పాజీ ఎలా అయ్యాడంటే..
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌కు ఎన్నో పేర్లున్నాయి. అభిమానులు ముద్దుగా లిటిల్‌మాస్టర్, మాస్టర్ బ్లాస్టర్, బ్యాటింగ్ మ్యాస్ట్రో అంటూ పిలుచుకుంటారు. అయితే, అతడికి మరో...
అంతా హర్భజన్ సింగే చేశాడు: నెహ్రా
ఇంటర్నెట్‌డెస్క్: క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌కు ఎన్నో పేర్లున్నాయి. అభిమానులు ముద్దుగా లిటిల్‌మాస్టర్, మాస్టర్ బ్లాస్టర్, బ్యాటింగ్ మ్యాస్ట్రో అంటూ పిలుచుకుంటారు. అయితే సచిన్‌కి మరో పేరు కూడా ఉంది. అదే సచిన్ పాజీ. సహజంగా ఇది బయటివాళ్లు ఎవరూ అనకపోయినా తన సహచరులు లేదా జూనియర్లు అలా ప్రేమతో పిలుస్తారు. పాజీ అంటే పెద్దన్న అని అర్థం. అంతకుముందు పాజీ అని 1983 ప్రపంచకప్ విజేత కపిల్‌దేవ్‌ని మాత్రమే పిలిచేవారు. 2003 ప్రపంచకప్ నుంచీ టీమ్‌ఇండియా క్రికెటర్లు తెందూల్కర్‌ను కూడా అదే గౌరవంతో పిలవడం మొదలుపెట్టారు. కాగా, అలా పిలవడానికి అసలు కారణం వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అట. అది కూడా అప్పుడు లీగ్ దశలో పాకిస్థాన్‌పై మ్యాచ్ గెలిచాకే అలా పిలవడం ప్రారంభించామని మాజీ పేసర్ నెహ్రా పేర్కొన్నాడు. తాజాగా అతడు స్టార్‌స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ నిర్వహించిన ‘2003 ప్రపంచకప్ సీక్రెట్స్’ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడు.
‘2003 ప్రపంచకప్ కన్నా ముందు టీమ్‌ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌లో మేం సచిన్‌ను అతడి పేరు పెట్టి పిలిచేవాళ్లం లేదా సచిన్ భాయ్ అనేవాళ్లం. కానీ పాకిస్థాన్‌తో మ్యాచ్ గెలిచాక సచిన్‌ను పాజీ అని తొలిసారి పిలవడం మొదలుపెట్టాం. హోటల్‌కు వెళ్లాక భజ్జీ ఒక పాట పాడాడు. పాజీ నంబర్ 1 అంటూ రాగం తీశాడు. దాంతో అప్పటి నుంచీ అందరం పాజీ అని పిలవడం ప్రారంభించాం. అంతకుముందు ఒకే పాజీ ఉండేవారు అది కపిల్‌దేవ్ మాత్రమే’ అని నెహ్రా వివరించాడు. ఇక అదే కార్యక్రమంలో మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కూడా మాట్లాడాడు. పాక్‌తో అదే మ్యాచ్‌లో అక్తర్ బౌలింగ్‌లో సచిన్ ఆడిన అప్పర్ కట్ సిక్స్‌ను కొనియాడాడు. తెందూల్కర్ అలాంటి షాట్ ఆడడం చాలా అరుదుగా చూశానని, అతడి బ్యాట్ చాలా బరువుగా ఉంటుందని కైఫ్ చెప్పాడు. సుమారు 150 కిమీ వేగంతో వచ్చే బంతిని అలా సిక్స్‌గా మలచడం అద్భుతమని కితాబిచ్చాడు. కాగా ఆ మ్యాచ్‌లో లిటిల్ మాస్టర్ విరోచితంగా బ్యాటింగ్ చేసి 98 పరుగుల వద్ద అక్తర్ బౌలింగ్‌లోనే ఔటవ్వడం తెలిసిందే. అయినా, పాక్ నిర్దేశించిన 274 పరుగుల లక్ష్యాన్ని టీమ్‌ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
సచిన్ రెండు దశాబ్దాలకు పైగా భారత క్రికెట్ అభిమానుల్నే కాకుండా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికుల్ని మురిపించాడు. తనదైన బ్యాటింగ్‌తో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్‌నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్‌కింగ్స్ ఒకటి. లఖ్‌నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్‌గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్‌కింగ్స్‌కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్‌లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్‌కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్‌మాస్టర్ గుకేశ్‌పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్‌కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్‌కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్‌కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్‌పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్‌లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్‌బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
-
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్