దూసుకెళ్లిన రోహిత్‌..టాప్‌-5లో అశ్విన్‌

ఐసీసీ తాజాగా టెస్టు ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. ఇంగ్లాండ్‌పై విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన రవిచంద్రన్‌ అశ్విన్‌, రోహిత్ శర్మ తమ ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకున్నారు.....

Published : 17 Feb 2021 15:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐసీసీ తాజాగా టెస్టు ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. ఇంగ్లాండ్‌పై విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన రవిచంద్రన్‌ అశ్విన్‌, రోహిత్ శర్మ తమ ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకున్నారు. ఎనిమిది వికెట్లతో పాటు రెండో ఇన్నింగ్స్‌లో శతకం సాధించిన యాష్‌‌ ఆల్‌రౌండర్‌ జాబితాలో అయిదో స్థానానికి చేరాడు. జేసన్ హోల్డర్, రవీంద్ర జడేజా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇక బౌలింగ్ విభాగంలో అశ్విన్‌, బుమ్రా వరుసగా ఏడు, ఎనిమిది స్థానాల్లో కొనసాగుతున్నారు. మొదటి స్థానంలో కమిన్స్ ఉన్నాడు.

మరోవైపు తొలి ఇన్నింగ్స్‌లో భారీశతకం సాధించిన హిట్‌మ్యాన్ బ్యాటింగ్‌ విభాగంలో టాప్-15లో నిలిచాడు. తొమ్మిది స్థానాలు ఎగబాకి 14వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో అర్ధశతకం సాధించిన కెప్టెన్‌ విరాట్ కోహ్లీ అయిదో ర్యాంక్‌లో ఉన్నాడు. నయావాల్ పుజారా ఒక ర్యాంక్‌ను కోల్పోయి ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు. రిషభ్‌ పంత్ (11) తన కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంక్‌ను అందుకున్నాడు. మరోవైపు రెండో టెస్టులో తక్కువ స్కోరుకే వెనుదిరిగిన ఇంగ్లాండ్ సారథి జో రూట్‌ నాలుగో ర్యాంక్‌కు పడిపోయాడు. అగ్రస్థానంలో కేన్‌ విలియమ్సన్‌ (919 పాయింట్లు) ఉన్నాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని