100 ఓవర్లకు ఆస్ట్రేలియా 196/9

బాక్సింగ్‌డే టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ పోరాడుతున్నారు. 133/6 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో మంగళవారం నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఆ జట్టు 100 ఓవర్లు పూర్తయ్యేసరికి...

Updated : 29 Dec 2020 07:27 IST

మెల్‌బోర్న్‌: బాక్సింగ్‌డే టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ పోరాడుతున్నారు. 133/6 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో మంగళవారం నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఆ జట్టు 100 ఓవర్లు పూర్తయ్యేసరికి 196/9తో నిలిచింది. నాలుగో రోజు క్రిస్‌గ్రీన్‌(45) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, పాట్‌కమిన్స్‌(22) పరుగులతో ఫర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో సిరాజ్‌ ఈ సెషన్‌లో రెండు వికెట్లు తీయగా, బుమ్రా ఒక వికెట్‌ పడగొట్టాడు. ప్రస్తుతం క్రీజులో హేజిల్‌వుడ్‌, మిచెల్‌ స్టార్క్‌ ఉన్నారు. రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా ముందు వీలైనంత లక్ష్యాన్ని ఉంచాలని ఆస్ట్రేలియా చూస్తోంది. 

ఇవీ చదవండి..
ఈ దశాబ్దం కోహ్లిదే
విరాట్‌కు పోటీయా! వార్నర్ ప్రశంసలివి

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని