క్రికెట్‌ దిగ్గజం డీన్‌జోన్స్‌ కన్నుమూత

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌, క్రికెట్‌ వ్యాఖ్యాత డీన్‌ జోన్స్‌(59) కన్నుమూశారు. యూఏఈలో జరుగుతున్న మెగా టీ20 క్రికెట్‌ లీగ్‌లో స్టార్‌స్పోర్ట్స్‌ తరఫున వ్యాఖ్యాతగా కొనసాగుతున్న...

Published : 24 Sep 2020 16:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత డీన్‌ జోన్స్‌(59) కన్నుమూశారు. యూఏఈలో జరుగుతున్న మెగా టీ20 క్రికెట్‌ లీగ్‌లో స్టార్‌స్పోర్ట్స్‌ తరఫున వ్యాఖ్యాతగా కొనసాగుతున్న ఆయన ప్రస్తుతం ముంబయిలోని ఓ హోటల్‌లో బస చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితం ఆయనకు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. మెల్‌బోర్న్‌లో పుట్టి పెరిగిన డీన్‌జోన్స్‌ ఆస్ట్రేలియా తరఫున 52 టెస్టులు ఆడగా 46.55 సగటుతో 3,631 పరుగులు చేశారు. అత్యధిక స్కోర్‌ 216 సాధించగా 11 శతకాలు నమోదు చేశారు. ఇక వన్డేల్లో 164 మ్యాచ్‌లు ఆడిన ఆయన 6,068 పరుగులు చేశారు. అందులో 7 శతకాలు, 46 అర్ధశతకాలు ఉన్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని