ఐపీఎల్‌ అధికారిక వాటాదారుగా ‘క్రెడ్‌’

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) అధికారిక వాటాదారుగా క్రెడిట్ కార్డ్‌ పేమెంట్‌ ప్లాట్‌ఫామ్‌..

Published : 03 Sep 2020 02:45 IST

(ఫొటో: బీసీసీఐ ట్విటర్‌ అకౌంట్‌)

దిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) అధికారిక వాటాదారుగా క్రెడిట్ కార్డ్‌ పేమెంట్‌ ప్లాట్‌ఫామ్‌ (క్రెడ్‌)ను ప్రకటిస్తూ ఐపీఎల్‌ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. రానున్న మూడు సీజన్లకు బెంగళూరు ఆధారిత క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపు వేదిక క్రెడ్‌ ప్రధాన వాటాదారుగా కొనసాగనున్నట్లు వెల్లడించింది. ‘ఇది మూడు సీజన్ల భాగస్వామ్యం. 2022 వరకు క్రెడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాం’ అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ‘2020 నుంచి 2022 సీజన్లు వరకు ఐపీఎల్ అధికారిక భాగస్వామిగా క్రెడ్‌ బోర్డులో ఉండటం సంతోషంగా ఉంది.  ఐపీఎల్‌కు క్రెడ్‌ లాంటి బ్రాండ్‌ తోడైతే మరింత ఆదరణ లభిస్తుంది’ అని ఐపీఎల్‌ ఛైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సరర్‌గా వివో తప్పుకున్నాక ఫాంటసీ క్రీడల నిర్వహణ సంస్థ డ్రీమ్‌11తో బీసీసీఐ స్పాన్సర్‌షిప్‌ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని