
ఎట్టకేలకు.. థామస్ కప్ వాయిదా
దిల్లీ: కరోనా వైరస్ ముప్పు నేపథ్యంలో థామస్ అండ్ ఉబర్ కప్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేస్తున్నట్టు బ్యాడ్మింటన్ ప్రపంచ సమాఖ్య ప్రకటించింది. డెన్మార్క్ వేదికగా జరగాల్సిన ఈ టోర్నీ నుంచి అగ్రశ్రేణి జట్లు తప్పుకోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. భారత్ సైతం ఈ టోర్నీ కోసం జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. పది మంది భారతీయుల బృందాన్ని సైనా నెహ్వాల్, పీవీ సింధు నడిపించాల్సింది. కాగా, ప్రస్తుత సమయంలో థామస్ కప్ నిర్వహణ సురక్షితమేనా అని సైనా సందేహాలు లేవనెత్తింది. చూస్తుంటే పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయని పేర్కొంది.
థామస్ కప్ అక్టోబర్ 3 నుంచి 11 వరకు జరగాల్సింది. వైరస్ ముప్పుతో తొలుత ఇండోనేసియా, దక్షిణ కొరియా తప్పుకున్నాయి. థాయ్‌లాండ్, ఆస్ట్రేలియా, చైనీస్ థైపీ, అల్గేరియా వారి బాటనే అనుసరించాయి. పెద్ద జట్లు తప్పుకోవడం, టోర్నీపై జట్లకు ఆసక్తి తగ్గిపోవడంతో ప్రపంచ సమాఖ్య వర్చువల్‌గా సమావేశమైంది. ఆతిథ్య దేశంతో చర్చించి టోర్నీని వచ్చే ఏడాదికి వాయిదా వేస్తూ తీర్మానం చేసింది. అంతేకాకుండా పురుషులు, మహిళల టీమ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ షెడ్యూళ్లనూ మారుస్తామని వెల్లడించింది. అయితే, తేదీలను ఇప్పుడే ప్రకటించమని పేర్కొంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.