బెంగళూరు స్కోర్‌ 171/6

షార్జా వేదికగా పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. కెప్టెన్‌ కోహ్లీ(48; 39 బంతుల్లో 3x4), క్రిస్‌ మోరిస్‌ (25; 8 బంతుల్లో 1x4, 3x6) రాణించారు. పంజాబ్‌

Updated : 15 Oct 2020 22:23 IST

చివరి ఓవర్‌లో రెచ్చిపోయిన క్రిస్‌మోరిస్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: షార్జా వేదికగా పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. కెప్టెన్‌ కోహ్లీ(48; 39 బంతుల్లో 3x4), క్రిస్‌ మోరిస్‌ (25; 8 బంతుల్లో 1x4, 3x6) రాణించారు. పంజాబ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో బెంగళూరు బ్యాట్స్‌మెన్‌ ధాటిగా ఆడలేకపోయారు. ఓపెనర్లు ఆరోన్‌ ఫించ్‌(20), దేవ్‌దత్‌ పడిక్కల్‌(18) 38 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే అర్షదీప్‌ వేసిన ఐదో ఓవర్‌ తొలి బంతికి పడిక్కల్‌ ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ కోహ్లీ అదే ఓవర్‌లో రెండు బౌండరీలు బాది జోరు మీద కనిపించాడు. ఫించ్‌తో కలిసి ధాటిగా ఆడాడు. జట్టు స్కోర్‌ 62 పరుగుల వద్ద ఫించ్‌ రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆపై వాషింగ్టన్‌ సుందర్‌(13), శివమ్‌దూబె(23) పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. వీరి తర్వాత వచ్చిన స్టార్‌ బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌(2) పూర్తిగా నిరాశపరిచాడు. షమి వేసిన 18వ ఓవర్‌లో డివిలియర్స్‌, కోహ్లీ ఔటయ్యారు. దీంతో బెంగళూరు 136/6తో నిలిచింది. చివరి రెండు ఓవర్లలో క్రిస్‌మోరిస్‌(25), ఇసురు ఉడాన(10) 34 పరుగులు చేయడంతో బెంగళూరు 171 పరుగులు చేసింది.

 

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని