రైనా.. ఇందుకోసమైనా మళ్లీ ఆడితే బాగుండు..!

టీమ్‌ఇండియాలో ఎంతో మంది గొప్ప క్రికెటర్లు ఆడారు. అటు బ్యాటింగ్‌తో పాటు ఇటు బౌలింగ్‌ విభాగంలోనూ పేరొందిన ప్రముఖులున్నారు. అలాగే మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌గా...

Published : 18 Aug 2020 19:42 IST

ఇలాంటి క్యాచ్‌లు ఐపీఎల్‌లో చూడాలి..

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియాలో అద్భుత ఫీల్డింగ్‌ అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మహ్మద్‌ కైఫ్‌, యువరాజ్‌ సింగ్‌, సురేశ్‌ రైనా, రవీంద్ర జడేజా. ఈ నలుగురు మిడిల్‌ఆర్డర్‌లో తమ బ్యాట్‌లతో పరుగులు తీయడమే కాకుండా ఫీల్డింగ్‌ విన్యాసాలతోనూ ప్రత్యేక గుర్తింపు పొందారు. 2002 నుంచీ యువీ, కైఫ్‌ ఆ స్థానాలను భర్తీ చేయగా తర్వాత రైనా కూడా వారిలా మారిపోయాడు. చివరికి రవీంద్ర జడేజా రూపంలో మరో అద్భుత ఫీల్డర్‌ వెలుగులోకి వచ్చాడు.

ఈ నలుగురూ ఎన్నోసార్లు బంతిని బౌండరీ చేరకుండా ఆపడం చూశాం. జట్టుకు ఎన్నో పరుగులను ఆదా చేయడం చూశాం. బ్యాట్స్‌మన్‌ కొట్టే షాట్లతో ఏ బంతైనా వాళ్ల వైపు నుంచి వెళ్తుంటే అమాంతం గాల్లోకి ఎగరడం, దాన్ని ఒడిసిపట్టుకోవడం వీరికి అలవాటే. అలాంటి మేటి ఫీల్డర్లలో ఒకరైన రైనా శనివారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ రిటైర్మెంట్‌ ప్రకటించిన కొద్ది నిమిషాల్లోనే అతడూ గుడ్‌బై చెప్పేశాడు. అయితే, టీమ్‌ఇండియాకు అతనాడే రోజుల్లో రెండు ఔరా అనిపించే క్యాచ్‌లు అందుకున్నాడు. బీసీసీఐ వాటిని ఒక వీడియోగా రూపొందించి మంగళవారం ట్విటర్‌లో అభిమానులతో పంచుకుంది. ఆ క్యాచ్‌లు చూస్తుంటే అతడు మళ్లీ బ్లూ జెర్సీలో ఆడితే బాగుండు అనిపిస్తుంది. అది సాధ్యం కాకపోయినా, ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌లో అయినా అలాంటి విన్యాసాలు చేయాలని ఆశిద్దాం. ఇక మీరు కూడా ఒకసారి ఆ వీడియోను వీక్షించి ఆనందించండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని