జాంటీరోడ్స్‌ ఈ క్యాచ్‌ను చూస్తే గర్వపడతాడు

క్రికెట్‌లో అప్పుడప్పుడూ ఫీల్డర్లు అద్భుత విన్యాసాలతో అమోఘమైన క్యాచ్‌లు పడుతుంటారు. గాల్లోకి డైవ్‌ చేస్తూ ఆమడ దూరంలో వెళ్తున్న బంతిని అమాంతం ఒంటి చేత్తో ఒడిసిపట్టుకుంటారు...

Published : 24 Nov 2020 11:40 IST

(Photo source Dele Alli Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్‌లో అప్పుడప్పుడూ ఫీల్డర్లు అద్భుత విన్యాసాలతో క్యాచ్‌లు పడుతుంటారు. గాల్లోకి డైవ్‌ చేస్తూ ఆమడ దూరంలో వెళ్తున్న బంతిని అమాంతం ఒంటి చేత్తో ఒడిసిపట్టుకుంటారు. అలాంటి క్యాచ్‌లను చూస్తే కొన్ని ‘ఔరా’ అనిపిస్తాయి.. మరికొన్ని ‘ఆహా ఏం క్యాచ్‌ పట్టాడ్రా అన్నట్లు ఉంటాయి. ఇంకొన్ని అయితే ‘క్రికెట్‌లోనే ఇది అత్యుత్తమ క్యాచ్‌’ అనేలా చేస్తాయి. ఇవన్నీ క్రికెటర్లకు సాధారణమే అయినా ఓ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ తాజాగా అందుకున్న ఓ క్యాచ్‌ ముక్కున వేలేసుకునేలా ఉంది. అది చూసిన ఓ నెటిజన్‌ జాంటీరోడ్స్‌ ఈ క్యాచ్‌ను చూస్తే గర్వపడతాడని పేర్కొన్నాడు. 

ఇంగ్లాండ్‌లోని టాటెన్‌హామ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ ఆటగాళ్లు ఇటీవల ఒక ఇండోర్‌ క్లాంప్లెక్స్‌లో వార్మప్‌లో భాగంగా క్రికెట్‌ ఆడారు. ఈ సందర్భంగా లెఫ్ట్‌హ్యాండ్‌ బ్యాట్స్‌మన్‌ మిడాన్‌ దిశగా బంతిని కొట్టగా అది నేలకు తక్కువ ఎత్తులో దూసుకెళ్లింది. దీంతో అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న డెలీ అలీ అనే ఆటగాడు కాలితో బంతిని ఆపే ప్రయత్నం చేశాడు. దాంతో అదతడి కాలికి తగిలి గాల్లోకి లేచింది. వెంటనే మళ్లీ ఎడమచేతితో ఆ బంతిని అందుకోవడంతో ఫీల్డర్లు, బ్యాట్స్‌మన్‌ షాకయ్యాడు. ఇలా కూడా క్యాచ్‌ పడతారా అనే రీతిలో ఆశ్చర్యపోయారు. ఈ ఘటనంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు కాగా, ఆ వీడియోను డెలీ ట్విటర్‌లో పంచుకున్నాడు. దీంతో అతడి క్యాచ్‌ నైపుణ్యాలను చూసి నెటిజన్లు ఫిదా అవ్వడమే కాకుండా అది బెస్ట్‌ క్యాచ్‌ అంటూ, జాంటీరోడ్స్‌ దాన్ని చూస్తే గర్వపడతాడంటూ కామెంట్లు చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని