భువి వచ్చే ఐపీఎల్‌కూ కష్టమే!  

టీమ్‌ఇండియా పేసర్‌ భువనేశ్వర్‌ వచ్చే ఐపీఎల్‌ ఆడటం కూడా కష్టమే. పిక్క కండరాల గాయంతో ఐపీఎల్‌-13 నుంచి అర్ధంతరంగా తప్పుకున్న అతను.. బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో కోలుకుంటున్నాడు...

Published : 26 Dec 2020 09:04 IST

దిల్లీ: టీమ్‌ఇండియా పేసర్‌ భువనేశ్వర్‌ వచ్చే ఐపీఎల్‌ ఆడటం కూడా కష్టమే. పిక్క కండరాల గాయంతో ఐపీఎల్‌-13 నుంచి అర్ధంతరంగా తప్పుకున్న అతను.. బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో కోలుకుంటున్నాడు. భువి పూర్తి ఫిట్‌నెస్‌ సాధించడానికి ఇంకా నాలుగు నెలలకు పైగా పట్టొచ్చని బోర్డు అధికారి ఒకరు చెప్పారు. షెడ్యూల్‌ ప్రకారం వచ్చే ఏప్రిల్‌లో ఐపీఎల్‌ ఆరంభం కావాల్సివుంది. గత రెండేళ్లుగా భువనేశ్వర్‌ గాయాలతో బాధపడుతున్నాడు. వెన్ను గాయం కారణంగా 2018లో ఐపీఎల్‌లో కొన్ని మ్యాచ్‌లకు దూరమైన భువి.. నిరుడు తొడ కండరాల గాయంతో ప్రపంచకప్‌ కూడా పూర్తిగా ఆడలేకపోయాడు. ఈ ఏడాది ఆరంభంలో అతను హెర్నియా ఆపరేషన్‌ చేయించుకున్నాడు.

ఇవీ చదవండి..

దాదాలా ధోనీ.. మహీలా కోహ్లీ చేయలేరు

‘మైండ్‌ గేమ్‌’ ఆడితే ఆడనివ్వండి: రహానె

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని