Published : 14/12/2020 01:51 IST

పంత్‌-సాహా స్థానంపై నిర్ణయం తలనొప్పే!

టీమిండియా బ్యాట్స్‌మన్ హనుమ విహారి

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటామని, బౌన్సర్లకు సమాధానం ఇస్తామని టీమిండియా బ్యాట్స్‌మన్ హనుమ విహారి ధీమా వ్యక్తం చేశాడు. గులాబి బంతితో జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో విహారి అజేయ శతకంతో సత్తాచాటిన విషయం తెలిసిందే. అంతేగాక పార్ట్‌టైమ్ స్పిన్నర్‌గా బౌలింగ్ చేసి వికెట్ కూడా సాధించాడు. సన్నాహక మ్యాచ్‌ అనంతరం అతడు మీడియాతో మాట్లాడాడు.

‘‘2018-19 ఆస్ట్రేలియా సిరీస్‌ నా కెరీర్‌లో రెండో విదేశీ పర్యటన. అప్పుడు ఆసీస్‌ పర్యటనను సవాలుగా భావించా. జట్టు విజయాల్లో చిన్నపాత్ర పోషించా. అయితే ఇప్పుడు నా ఆటతీరు, గేమ్‌ప్లాన్‌తో పరుగులు చేయడానికి సిద్ధంగా ఉన్నా. అయితే ఆసీస్‌లో బౌన్సర్లు కీలకపాత్ర పోషిస్తాయి. వాటిని పరిస్థితులకు తగ్గట్టుగా ఎదుర్కోవడానికి మేం సిద్ధమయ్యాం’’ అని విహారి పేర్కొన్నాడు. పుజారా, అజింక్య రహానె గురించి మాట్లాడుతూ.. వారిద్దరు ఆటను బాగా అర్థం చేసుకుంటారని, అంతేగాక సలహాలు ఇస్తూ ప్రోత్సహిస్తారని అన్నాడు.

ఆస్ట్రేలియా-ఎతో జరిగిన తొలి ప్రాక్టీస్‌ మ్యాచ్‌ సాహా అర్ధశతకం సాధించగా రెండో సన్నాహక మ్యాచ్‌లో పంత్‌ మెరుపు శతకం బాదాడు. దీంతో తుదిజట్టులో వికెట్‌కీపర్‌గా వీరిద్దరిలో ఎవరికి అవకాశం వస్తుందని ఆసక్తి నెలకొంది. దీనిపై విహారి స్పందిస్తూ ఇద్దరి మధ్య తీవ్ర పోటీ ఉందని అంగీకరించాడు. ‘‘జట్టులో ఆరోగ్యమైన పోటీ ఎప్పుడూ మంచిదే. అయితే జట్టులో ప్రతీ స్థానానికి పోటీ ఉంది. ఎవరిని తుదిజట్టులోకి తీసుకోవాలనేది జట్టు యాజమాన్యం నిర్ణయిస్తుంది. సాహా, పంత్ ఇద్దరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. వారిద్దరిలో ఒకరిని ఎంచుకోవడం కఠినమైన నిర్ణయం. ఇది తలనొప్పే’’ అని విహారి అన్నాడు.

అయితే సాహాకు బదులుగా పంత్‌ జట్టులోకి వస్తాడని వార్తలు వస్తున్నాయి. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో సాహా ఫీల్డింగ్‌ చేయగా పంత్ వికెట్‌కీపింగ్ చేశాడు. అంతేగాక ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌ కావడం పంత్‌కు కలిసొచ్చే అంశం. టీమిండియా టెస్టు జట్టులో జడేజా, పంత్ మినహా ఎవరూ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌ లేరు. జడేజా గాయంతో తొలి టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. దీంతో పంత్‌కు అవకాశాలు పెరిగాయి. కాగా, నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా డిసెంబర్‌ 17న అడిలైడ్ వేదికగా భారత్‌×ఆస్ట్రేలియా మధ్య తొలి డే/నైట్ టెస్టు జరగనుంది.

ఇదీ చదవండి

భారత్‌కు లాభం.. ఆసీస్‌కు గందరగోళం

రోహిత్‌.. నీ నుంచి మరో డబుల్‌ ధమాకా కావాలి

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని