
పారిస్ ఒలింపిక్స్లో బ్రేక్డాన్స్
ఇంటర్నెట్డెస్క్: 2024 పారిస్ ఒలింపిక్స్లో తొలిసారి బ్రేక్డాన్స్ను ప్రవేశపెడుతున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటి అధ్యక్షుడు థామస్ బాచ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దాంతో పాటు సర్ఫింగ్, స్పోర్ట్ క్లైంబింగ్, స్కేట్బోర్డింగ్లను కూడా ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. వాటిని సర్దుబాటు చేయడానికి, అథ్లెట్ల సంఖ్యను 10,500కు తగ్గించడానికి.. బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్లను తొలగిస్తున్నట్లు స్పష్టం చేశారు. బ్రేక్డాన్సింగ్ పట్ల యువతలో ఉన్న క్రేజ్ కారణంగా అటు వారిని, ఇటు స్పాన్సర్లను ఆకర్షించడానికి దీన్ని ఒలింపిక్స్లో భాగం చేస్తున్నట్లు వివరించారు. అమ్మాయిలు, అబ్బాయిలు రెండు విభాగాల్లో చెరో 16 మంది పాల్గొంటారని తెలిపారు. 2018లో బ్యూనస్ ఏయిర్స్ యూత్ ఒలింపిక్స్ దిగ్విజయంగా పూర్తిచేసిన వెంటనే ఒలింపిక్స్ క్రీడల్లో బ్రేక్డాన్స్ ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే 2024 పారిస్ ఒలింపిక్స్లో తొలిసారి బ్రేక్డాన్స్ను కలుపుతున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా, కరోనా పరిస్థితుల కారణంగా ఈ ఏడాది జులైలో జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అథ్లెట్లంతా ఆ మెగా ఈవెంట్లో సత్తా చాటాలని చూస్తున్నారు. ఎలాగైనా అక్కడ పతకాల పంట పండించుకోవాలని తహతహలాడుతున్నారు. అయితే, పారిస్ ఒలింపిక్స్లో వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్ ఈవెంట్లు లేకపోవడం ఆయా అథ్లెట్లకు మింగుడు పడని విషయంగా మారింది.
ఇవీ చదవండి..