విరుష్క.. ఆసీస్‌లో బిడ్డను కనండి!

ఆస్ట్రేలియాతో జరుగుతున్న గులాబి పోరులో టీమ్‌ఇండియా అద్భుతంగా ఆడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కంగారూలను 191కే కుప్పకూల్చింది. రవిచంద్రన్‌ అశ్విన్‌, జస్ప్రీత్‌ బుమ్రా, ఉమేశ్‌ యాదవ్‌ తమ బౌలింగ్‌తో...

Published : 19 Dec 2020 01:44 IST

ఆహ్వానించిన బ్రెట్‌లీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న గులాబి పోరులో టీమ్‌ఇండియా అద్భుతంగా ఆడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కంగారూలను 191కే కుప్పకూల్చింది. రవిచంద్రన్‌ అశ్విన్‌, జస్ప్రీత్‌ బుమ్రా, ఉమేశ్‌ యాదవ్‌ తమ బౌలింగ్‌తో బెంబేలెత్తించారు. మరోవైపు ఫామ్‌లో ఉన్న సారథి విరాట్‌ కోహ్లీ ఈ టెస్టు తర్వాత భారత్‌కు బయల్దేరుతున్న సంగతి తెలిసిందే. కాగా అతడి సతీమణి ఆస్ట్రేలియాలో ప్రసవిస్తే బాగుంటుందని మాజీ పేసర్‌ బ్రెట్‌లీ అంటున్నాడు.

అనుష్కశర్మ జనవరిలో ప్రసవించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తొలి టెస్టు తర్వాత కోహ్లీ భారత్‌కు వచ్చేస్తున్నాడు. ఇప్పటికే బీసీసీఐ అతడికి పితృత్వపు సెలవులు మంజూరు చేసింది. దాంతో మిగిలిన మూడు టెస్టులకు రహానె సారథ్యం వహించనున్నాడు. కానీ విరాట్‌ ఆడాలని ఆసీస్‌ అభిమానులు, మాజీ క్రికెటర్లు కోరుకుంటున్నారు. కొందరైతే అసలు అనుష్క ఆస్ట్రేలియాలోనే ప్రసవిస్తుందని భావించామని అంటున్నారు. తాజా బ్రెట్‌లీ.. విరుష్క జంటను ఆసీస్‌కు ఆహ్వానించాడు.

‘కోహ్లీ, మీకు ఇష్టమైతే ఆస్ట్రేలియాలో మీ బిడ్డకు మేం స్వాగతం చెబుతాం. ఎందుకంటే మేం మిమ్మల్ని అంగీకరిస్తున్నాం. మీకు మగ బిడ్డ పుట్టినా.. ఆడబిడ్డ పుట్టినా మాకు సంతోషమే’ అని బ్రెట్‌లీ మీడియాతో చెప్పాడు. ఐపీఎల్‌ సమయంలో దుబాయ్‌కు వెళ్లిన అనుష్క ఇప్పుడు భారత్‌లోనే ఉంటోంది. మాతృత్వపు మధురిమలను ఆస్వాదిస్తోంది. తన అనుభవాలు, అనుభూతులను సోషల్‌మీడియాలో పంచుకుంటోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు