
నీ మాటలతో ఏకీభవిస్తున్నా చాహల్..
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా చలాకీ స్పిన్నర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు యజువేంద్ర చాహల్ శనివారం కాబోయే సతీమణి ధనశ్రీ వర్మతో కలిసి దిగిన ఓ అద్భుతమైన ఫొటోను పంచుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో దాన్ని పోస్టు చేస్తూ.. ‘నా మదిలోని పిజ్జాను నువ్వే దోచేశావ్’ అని సరదాగా కామెంట్ చేశాడు. కొద్ది రోజుల క్రితమే అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ధనశ్రీతో తనకు నిశ్చితార్థం జరిగిందని సామాజిక మాధ్యమాల్లో ఫొటోలతో సహా వెల్లడించిన అతడు గతవారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆమెతో కలిసి ఫొటో పంచుకున్నాడు. ఇప్పుడు శనివారం మరో ఛార్మింగ్ ఫొటోను పోస్టు చేశాడు. చాహల్ కామెంట్‌కు సరదాగా బదులిచ్చిన ధనశ్రీ.. ‘నీ మాటలతో ఏకీభవిస్తున్నా’ నంటూ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, ఈ ఏడాది ఐపీఎల్ ఆడేందుకు ఆర్సీబీ శుక్రవారమే బెంగళూరు నుంచి దుబాయ్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడా ఆటగాళ్లంతా క్వారంటైన్లో ఉన్నారు. వచ్చే నెల 19 నుంచి మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. మరోవైపు శుక్రవారం ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ దుబాయ్‌లోని హోటల్ గది నుంచి తీసుకున్న ఒక ఫొటోను ఇన్‌స్టాలో పంచుకున్నాడు. దానికి ‘హలో దుబాయ్’ అని వ్యాఖ్యానించాడు. దీనికి స్పందించిన చలాకీ స్పిన్నర్.. ‘హలో భయ్యా మేం కూడా నీ పక్కనే ఉంటాం’ అంటూ సరదాగా కామెంట్ చేశాడు. దీనికి నెటిజన్ల నుంచి సైతం విశేషమైన స్పందన వచ్చింది.
ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు/ సేవల గురించి ఈనాడు సంస్థకి ఎటువంటి అవగాహనా ఉండదు. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి, జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు.