ధోనీని వదులుకోవడమే చెన్నైకి ఉత్తమం

ఐపీఎల్‌లో తొమ్మిదో జట్టుకు ప్రవేశం కల్పించాలంటే బీసీసీఐ 2021 సీజన్‌కు మెగా వేలాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. అయితే మెగా వేలం నిర్వహిస్తే చెన్నై కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీని

Published : 18 Nov 2020 01:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌లో తొమ్మిదో జట్టుకు ప్రవేశం కల్పించాలంటే బీసీసీఐ 2021 సీజన్‌కు మెగా వేలాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. అయితే మెగా వేలం నిర్వహిస్తే చెన్నై కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీని వదులుకోవడమే ఆ జట్టుకు ప్రయోజనమని టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. ధోనీని విడిచిపెట్టిన తర్వాత రైట్ టూ కార్డ్‌ ద్వారా తిరిగి జట్టులోకి తీసుకుంటే లాభదాయకంగా ఉంటుందని తెలిపాడు. అలా కాకుండా రిటైన్డ్ ప్లేయర్‌గా జట్టుతో కొనసాగిస్తే ఎక్కువ మొత్తంలో డబ్బును నష్టపోతారని అన్నాడు.

‘‘మెగా వేలానికి ఎంఎస్ ధోనీని చెన్నై విడుదల చేయాలి. మెగా వేలంలో తీసుకున్న ఆటగాడు మూడేళ్ల పాటు జట్టుతో ఉంటాడు. కానీ ధోనీ మూడేళ్లు ఆడతాడా? అయితే ధోనీని తీసుకోవద్దని నా ఉద్దేశం కాదు. అతడు తర్వాత సీజన్‌ తప్పక ఆడతాడు. కానీ అతడిని రిటైన్డ్‌ ప్లేయర్‌గా జట్టుతో కొసాగిస్తే రూ.15 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ధోనీ మూడేళ్లు ఆడకుండా 2021 సీజన్‌ మాత్రమే ఆడితే, 2020 సీజన్‌లో రూ.15 కోట్లు మిగులుతాయి. ఆ మొత్తానికి తగిన సామర్థ్యం ఉన్న ఆటగాడిని తర్వాత సొంతం చేసుకోగలరా? అందుకే మెగా వేలంలో ఎక్కువ మొత్తాన్ని వెచ్చించి బలమైన జట్టును తయారుచేసుకోవడం ఉత్తమం. ధోనీని వదిలిపెట్టి రైట్‌ టూ మ్యాచ్‌ కార్డ్‌ ద్వారా తిరిగి జట్టులోకి తీసుకుంటే మిగిలిన మొత్తంతో కీలక ఆటగాళ్లును సొంతం చేసుకోవచ్చు. అప్పుడు డబ్బులు కలిసొస్తాయి. అయితే మెగా వేలం చెన్నై జట్టుకు కచ్చితంగా అవసరం. ఎందుకంటే రిటైన్డ్‌ చేసుకునేంత స్థాయిలో ఆటగాళ్లు లేరు’’ అని ఆకాశ్‌ చోప్రా వెల్లడించాడు. ఐపీఎల్ 13వ సీజన్‌లో చెన్నై పేలవ ప్రదర్శనతో ప్లేఆఫ్‌కు చేరని సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని