
హోరెత్తించిన హుడా.. చెన్నై లక్ష్యం 154
ఇంటర్నెట్‌డెస్క్: దీపక్ హుడా (62*; 30 బంతుల్లో, 3×4, 4×6) అజేయ అర్ధశతకంతో చెలరేగి ఆడిన వేళ పంజాబ్ 154 పరుగుల లక్ష్యాన్ని చెన్నై ముందుంచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాహుల్ సేన నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. పంజాబ్‌కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (29; 27 బంతుల్లో, 3×4, 1×6), మయాంక్ అగర్వాల్ (26; 15 బంతుల్లో, 5×4) ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించారు. ఎంగిడి బౌలింగ్‌లో మయాంక్ ఔటైనప్పటికీ పవర్‌ప్లేలో 53 పరుగులతో గొప్ప స్థితిలోనే నిలిచింది. అయితే తర్వాత చెన్నై బౌలర్లు పుంజుకుని స్వల్ప వ్యవధిలోనే రాహుల్, నికోలస్ పూరన్ (2), క్రిస్ గేల్ (12)ను పెవిలియన్‌కు చేర్చారు.
ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన దీపక్ హుడా ఇన్నింగ్స్ స్వరూపాన్ని మార్చాడు. మన్‌దీప్ సింగ్ (14; 15 బంతుల్లో)తో కలిసి తొలుత నిదానంగా ఆడిన అతడు తర్వాత గేర్ మార్చి చెలరేగాడు. ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 26 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. చెన్నై బౌలర్లలో ఎంగిడి మూడు వికెట్లు, జడేజా, తాహిర్, శార్దూల్ తలో వికెట్ తీశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.