బాక్సింగ్‌డే టెస్టులో ప్రతిష్ఠాత్మక పతకం..

డిసెంబర్‌ 26 నుంచి మెల్‌బోర్న్‌ వేదికగా జరిగే బాక్సింగ్‌డే టెస్టులో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా ఎంపికైన ఆటగాడికి ప్రతిష్ఠాత్మక ‘జానీ ముల్లఘ్‌ పతకాన్ని’ బహుకరిస్తామని క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) ప్రకటించింది...

Published : 22 Dec 2020 01:51 IST

మెల్‌బోర్న్‌: డిసెంబర్‌ 26 నుంచి మెల్‌బోర్న్‌ వేదికగా జరిగే బాక్సింగ్‌డే టెస్టులో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా ఎంపికైన ఆటగాడికి ప్రతిష్ఠాత్మక ‘జానీ ముల్లఘ్‌ పతకాన్ని’ బహుకరిస్తామని క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) ప్రకటించింది. సోమవారం ట్వీట్‌ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది. 1868లో ఆస్ట్రేలియా తొలి అంతర్జాతీయ పర్యటన సందర్భంగా ఇంగ్లాండ్‌కు వెళ్లిన ఆ జట్టుకు ముల్లఘ్‌ కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆ పర్యటనలో ఆయన 45 మ్యాచ్‌లు ఆడగా 20 సగటుతో 1,698 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్‌ విభాగంలో 1,877 ఓవర్లకు గాను 831 ఓవర్లు మెయిడిన్లు చేశాడు. 245 వికెట్లు పడగొట్టాడు. అతడి సేవలను గుర్తు చేసుకుంటూ భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగే రెండో టెస్టులో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ను ఈ విధంగా సన్మానిస్తున్నట్లు సీఏ వివరించింది. 

ఇక అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 53 పరుగుల తేడాతో వెనుకపడిపోయినా రెండో ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా పుంజుకుంది. ముఖ్యంగా జోష్‌ హాజిల్‌వుడ్‌ 5/8, పాట్‌ కమిన్స్‌ 4/21 అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో భారత్‌ 36/9కే పరిమితమై తన టెస్టు చరిత్రలో అత్యంత ఘోరమైన రికార్డు నెలకొల్పింది. చివరికి ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయి 90 పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌పైన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. మరి రెండో టెస్టులో ఈ ఘనత సాధించి ఆ ప్రతిష్ఠాత్మక పతకం ఎవరు సాధిస్తారో వేచి చూడాలి.

ఇవీ చదవండి..

కిం కర్తవ్యం..!

తొలి ఆస్ట్రేలియా పర్యటన చాలా నేర్పింది 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని