టీ20లకు ముందు భారత్‌కు సానుకూల అంశాలు

ఆస్ట్రేలియాపై మూడో వన్డేలో గెలుపొందిన టీమ్‌ఇండియాకు పొట్టి సిరీస్‌ ముందు భారీ ఉపశమనం లభించింది. తొలి రెండు వన్డేల్లో ఘోరంగా విఫలమైన కోహ్లీసేన బుధవారం విజయం సాధించి...

Updated : 03 Dec 2020 15:13 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియాపై మూడో వన్డేలో గెలుపొందిన టీమ్‌ఇండియాకు పొట్టి సిరీస్‌ ముందు భారీ ఉపశమనం లభించింది. తొలి రెండు వన్డేల్లో ఘోరంగా విఫలమైన కోహ్లీసేన బుధవారం విజయం సాధించి రాబోయే మ్యాచ్‌లపై ఆసక్తి పెంచింది. హార్దిక్‌ పాండ్య(92*), రవీంద్ర జడేజా(66*) మెరుపు బ్యాటింగ్‌కు తోడు శార్దుల్‌ ఠాకుర్‌ 3/51, బుమ్రా 2/43, నటరాజన్‌ 2/70 అద్భుతమైన బౌలింగ్‌ చేయడంతో భారత్‌ మూడో వన్డేలో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసింది. దీంతో వరుసగా రెండు భారీ ఓటములతో డీలా పడిన కోహ్లీసేనకు ఈ విజయం ఊరటనిచ్చింది. ఈ క్రమంలోనే టీ20 సిరీస్‌కు ముందు.. మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా టీమ్‌ఇండియాలో పలు సానుకూల అంశాలు గమనించాడు. వాటిని తన యూట్యూబ్‌ ఛానల్‌లో వివరించాడు. 

హార్దిక్‌ ఈ వన్డే సిరీస్‌లో అద్భుతంగా మెరిశాడు. టీమ్‌ఇండియా తరఫున ఎవరైనా బాగా ఆడారంటే అది అతడొక్కడే. నిలకడగా ఆడి భారత్‌ తరఫున అత్యధిక పరుగులు చేశాడు. వీలు చిక్కినప్పుడు బౌలింగ్‌తోనూ ఆకట్టుకున్నాడు. 

మరో ఆటగాడు రవీంద్ర జడేజా. బంతితో మరింత మంచి ప్రదర్శ చేస్తాడని ఆశించాను. అతడు వికెట్లు తీయలేకపోయాడు. పొదుపుగా బౌలింగ్‌ చేసినా వికెట్లు పడగొట్టాల్సింది. అయితే, అతడు బ్యాటింగ్‌ బాగుంది. 

శార్దూల్‌ ఠాకుర్‌ ఒక్క మ్యాచ్‌లోనే మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. నటరాజన్‌ కూడా మంచి ప్రదర్శన చేశాడు. బౌలింగ్‌ పరంగా వీళ్లిద్దరూ సానుకూలంగా కనిపించారు. 

ఇక శిఖర్‌ ధావన్‌ తొలి మ్యాచ్‌లో మెరిసినా, రెండో వన్డేలో ఫర్వాలేదనిపించాడు. కానీ, మూడో వన్డేలో విఫలమయ్యాడు. అతడి నుంచి మరింత ఆశించాను. 

కెప్టెన్ విరాట్‌ కోహ్లీ సెంచరీ కొట్టకపోయినా మంచి పరుగులు చేశాడు. ముఖ్యంగా మూడో వన్డేలో కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడి ఆకట్టకున్నాడు. 

మహ్మద్‌ షమి తొలి రెండు వన్డేల్లో ఆకట్టుకున్నాడు. మూడో వన్డేలో బుమ్రా కూడా అద్భుత బౌలింగ్‌ చేశాడు. 

కేఎల్‌ రాహుల్‌ని టాప్‌ ఆర్డర్‌లోకి తీసుకొస్తే బాగుండేది. అక్కడైతే మరింత బాగా ఆడేవాడు. శ్రేయస్‌ అయ్యర్‌కు ఈ సిరీస్‌ చెప్పుకోదగింది కాదు. అతడు విఫలమయ్యాడు. బౌలింగ్‌లో చాహల్‌, నవ్‌దీప్‌ సైని విఫలమయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని