డీన్‌జోన్స్ ఉదయం బాగానే ఉన్నారు: పఠాన్
ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డీన్‌జోన్స్ ఆకస్మిక మృతిపట్ల పలువురు క్రికెటర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఈ ఉదయం బాగానే ఉన్నారని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్‌పఠాన్ అన్నాడు..
దిగ్గజ ఆటగాడి మృతి పట్ల క్రికెటర్ల సంతాపం
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డీన్‌జోన్స్ ఆకస్మిక మృతిపట్ల పలువురు క్రికెటర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఈ ఉదయం బాగానే ఉన్నారని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. యూఏలో జరుగుతున్న టీ20 మెగా క్రికెట్ లీగ్ కోసం జోన్స్ ప్రస్తుతం ముంబయిలో ఉంటున్నారు. స్టార్‌స్పోర్ట్స్ తరఫున ఆయన వ్యాఖ్యాతగా కొనసాగుతున్నారు. అయితే, గురువారం తాను బస చేస్తున్న ముంబయిలోని ఓ హోటల్లో గుండెపోటుతో మృతిచెందారు. ఆయన ఆకస్మిక మృతిపట్ల పలువురు క్రికెట్ ప్రముఖులు స్పందించారు. ట్విటర్ వేదికగా తమ సంతాపం తెలిపారు.
ఈ విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యా. ఎంతో బాధగా ఉంది. ఈ రోజు ఉదయం కూడా డీన్ బాగానే ఉన్నారు. రెండు రోజుల క్రితమే ఆయన కుమారుడితో మాట్లాడా. అంతా బానే ఉంది కానీ, ఇది నమ్మలేకపోతున్నా. రెస్ట్ ఇన్ పీస్
-ఇర్ఫాన్ పఠాన్
ఈ వార్తని నమ్మలేకపోతున్నా. జోన్స్ లేరని తెలిసి బాధగా ఉంది. రెస్ట్ ఇన్ పీస్ డీన్. మిమ్మల్ని మిస్ అవుతాం
-డేవిడ్‌వార్నర్
డీన్‌జోన్స్ ఇకలేరని తెలిసి షాకయ్యా. మైదానంలో అతడి బ్యాటింగ్, స్టూడియోలో అతడి విశ్లేషణలు ఎంతో రమ్యంగా ఉంటాయి. ఇకపై అతడితో కలిసి మాట్లాడలేం. టీవీలోనూ చూడలేం’
-మహ్మద్ కైఫ్
నా ఫేవరెట్ వ్యాఖ్యాతల్లో ఆయన ఒకరు. నేను సాధించిన ఎన్నో ఘనతలకు వ్యాఖ్యాతగా తన గొంతుక వినిపించారు. అతడితో ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. చాలా మిస్ అవుతాం
-వీరేంద్ర సెహ్వాగ్
ఇదో హృదయ విదారక సంఘటన. ఓ మంచి వ్యక్తిని త్వరగా కోల్పోయాం. నా తొలి ఆస్ట్రేలియా పర్యటనలో అతడితో కలిసి ఆడే అవకాశం దక్కింది. అతడి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా. కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా
-సచిన్ తెందూల్కర్
డీన్‌జోన్స్ మృతిచెందారని తెలిసి ఆశ్చర్యానికి లోనయ్యా. అతడి కుటుంబ సభ్యులు, స్నేహితులకు సంతాపం
-విరాట్ కోహ్లీ
ఇదో షాకింగ్ న్యూస్. ఈ సంవత్సరం ఇంకా దారుణంగా తయారవుతోంది. గతవారమే అతడితో సరదాగా జోకులు వేశా. ఇప్పుడిలా జరగడం దారుణం. అతడి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి
-అనిల్‌కుంబ్లే
జోన్స్ ఆకస్మిక మృతిపట్ల విచారం వ్యక్తం చేస్తున్నాం. క్రికెట్ రంగానికి తీరని లోటు. చెపాక్‌తో అతడికున్న అనుబంధం ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. అతడి కుటుంబం, స్నేహితులకు సంతాపం తెలియజేస్తున్నాం. రెస్ట్ ఇన్ పీస్
-చెన్నై టీమ్
రెస్ట్ ఇన్ పీస్ ప్రొఫెసర్. ఈ క్రికెట్ ప్రపంచం మీ విలువైన పాఠాల్ని మిస్ అవుతుంది
-ముంబయి టీమ్
జోన్స్ మృతి విషయం తెలిసి బాధగా ఉంది.
-బెంగళూరు టీమ్
రెస్ట్ ఇన్ పీస్ డీన్‌జోన్స్. మిమ్మిల్ని మిస్ అవుతున్నాం.
-పంజాబ్ టీమ్
జోన్స్ ఎప్పటికీ ప్రొఫెసరే. క్రికెట్ దిగ్గజాల్లో ఒకరైన ఆయన మరణించారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాం. ఈ కష్టతర సమయంలో మా ప్రార్థనలన్నీ వారి కుటుంబసభ్యులకు ఉంటాయి.
-దిల్లీ జట్టు
క్రికెటర్, కోచ్, వ్యాఖ్యాత. ఎన్నో నైపుణ్యాలు కలిగిన గొప్ప వ్యక్తి ఆయన. జోన్స్ అకాల మృతి క్రికెట్ ప్రపంచానికి తీరని లోటు
-హైదరాబాద్ జట్టు
అద్భుతమైన ఆటగాడు, అలాగే మనోరంజకమైన వ్యాఖ్యాత. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతాం.
-కోల్‌కతా జట్టు
మిమ్మల్నీ, మీ గొంతుకను ఇక వినలేం ప్రొఫెసర్. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత డీన్‌జోన్స్ లేరని తెలిసి బాధగా ఉంది.
-రాజస్థాన్ జట్టు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రషీద్ బౌలింగ్‌లో సిక్స్‌లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
తన అభిమాన క్రికెటర్‌తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం ఎప్పటికీ మరిచిపోలేనని చెన్నై ఆటగాడు సమీర్ రిజ్వీ వ్యాఖ్యానించాడు. -
గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్‌కతా మాజీ ఆటగాడు
కోల్‌కతా ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిత్ వల్ల చాలామంది విదేశీ క్రికెటర్లు ఇబ్బందిపడ్డారని నమీబియా క్రికెటర్ వ్యాఖ్యానించడం సంచలనమైంది. -
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
ముంబయి బౌలర్లు భారీగా పరుగులు ఇవ్వడంతో హైదరాబాద్ రికార్డు స్కోరును నమోదు చేసి చరిత్ర సృష్టించింది. దీంతో ఐపీఎల్ 17వ సీజన్లో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. -
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్‌గా మారిన కావ్యా మారన్
కావ్యా మారన్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని. ముంబయితో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ భారీ స్కోరు సాధించడంతో ఆమె ఒక్కసారిగా నెట్టింట వైరల్‌గా మారారు. -
ముంబయి లక్ష్య ఛేదన దిశగా వస్తుందని భావించారా? ప్యాట్ కమిన్స్ సమాధానమిదే!
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ బోణీ కొట్టింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబయిని చిత్తు చేసింది. -
హైదరాబాద్, ముంబయి మ్యాచ్‌లో నమోదైన రికార్డులివీ..
ఉప్పల్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదు అయ్యాయి. -
ఉప్పల్ ఊగిపోయింది
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్‌తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్‌లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. -
ఇది సన్రైజర్సేనా?
సన్‌రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్‌కు మారు పేరు! సన్‌రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్‌రేట్‌లో ఎప్పుడూ వెనుకంజే! సన్‌రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! -
సింధు శుభారంభం
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. -
సెమీస్‌లో బోపన్న జోడీ
44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్ వెటరన్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. -
ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ గోల్‌కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడు. -
‘ఇంపాక్ట్ ప్లేయర్’ వల్లే ధోని అలా..
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. -
కోచ్‌కు జకోవిచ్ టాటా
కోచ్ గోరాన్ ఇవానిసెవిచ్‌తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్‌తో కలిసి జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. -
సచిన్ గోల్ఫాట
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్‌హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. -
భారత్-పాక్ సిరీస్.. ఆసీస్ ఆసక్తి
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. -
ముంబయిలో హార్దిక్‌కు మరింతగా..
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్‌గా ఎంపికైన హార్దిక్ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. -
మళ్లీ బాబర్‌కే పగ్గాలు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పగ్గాలు మళ్లీ బాబర్ అజామ్ చేతికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అతణ్ని మరోసారి జట్టు కెప్టెన్‌గా నియమించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. -
స్టిమాక్‌ను తప్పించాల్సిందే
ఫుట్‌బాల్ ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో చిన్న జట్టు అఫ్గానిస్థాన్ చేతిలో భారత్ అనూహ్య ఓటమితో కోచ్ స్టిమాక్‌ను తప్పించాలని మాజీ ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్‌లో సిక్స్‌లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్‌బర్గ్ గాలం?