Published : 13/12/2020 02:22 IST

మిస్టరీ స్పిన్నర్‌ ఓ ఇంటివాడయ్యాడు

ఇంటర్నెట్‌డెస్క్‌: కోల్‌కతా‌ జట్టు మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి ఓ ఇంటివాడయ్యాడు. అతి కొద్దిమంది ఆత్మీయుల సమక్షంలో తన ప్రేయసిని వివాహం చేసుకున్నాడు. అయితే ఈ విషయాన్ని వరుణ్ అధికారికంగా వెల్లడించలేదు. అతడి స్నేహితుడు అరుణ్ కార్తిక్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో వరుణ్ పెళ్లి ఫొటో షేర్‌ చేయడంతో అభిమానులకు ఈ విషయం తెలిసింది. కాగా, ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది. టీమిండియా పేసర్‌ నటరాజన్‌ పోస్ట్‌కు లైక్‌ కొట్టాడు.

యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్‌ పదమూడో సీజన్‌లో కోల్‌కతా తరఫున ఆడిన ఈ లెగ్ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి గొప్ప ప్రదర్శన చేశాడు. దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో అయిదు వికెట్లు పడగొట్టి అందరి దృష్టి తనవైపు తిప్పుకున్నాడు. మొత్తంగా ఈ సీజన్‌లో 6.84 ఎకానమీతో పరుగులు ఇచ్చి 17 వికెట్లు పడగొట్టాడు. బ్యాట్స్‌మెన్‌కు సమాధానం దొరకని బంతులు వేసే అతడు ఆస్ట్రేలియా పర్యటనలో టీ20 సిరీస్‌కు కూడా ఎంపికయ్యాడు. కానీ గాయంతో అతడు పర్యటనకు దూరమయ్యాడు. కాగా, అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన నటరాజన్ సత్తాచాటిన విషయం తెలిసిందే. అయితే ప్రతిభకు కొదవలేని వరుణ్‌ త్వరలోనే భారత జట్టులోకి వస్తాడని సీనియర్‌ క్రికెటర్లు ఆశిస్తున్నారు. వచ్చే ఏడాది భారత్‌లోనే టీ20 ప్రపంచకప్‌  జరుగుతుండటంతో లెగ్‌ స్పిన్నర్‌ చక్రవర్తి కీలకమవుతాడని విశ్లేషిస్తున్నారు.

దీ చదవండి

నీ ప్రయాణం అజరామరం..

కోహ్లీ లేకపోతే భారత్‌కు అంత నష్టమా?


Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని