ఏటీపీ ఫైనల్స్‌ విజేత మెద్వెదెవ్‌

ఏటీపీ ఫైనల్స్‌లో డానిల్‌ మెద్వెదేవ్‌ తొలిసారి టైటిల్‌ సాధించాడు. సెమీస్‌లో ప్రపంచ నంబర్‌ 2 ఆటగాడు రఫెల్‌ నాదల్‌ను ఓడించిన అతడు తుదిపోరులో డొమినిక్‌ థీమ్‌ను ఓడించాడు...

Updated : 23 Nov 2020 13:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఏటీపీ ఫైనల్స్‌లో డానియల్‌ మెద్వెదెవ్‌ తొలిసారి టైటిల్‌ సాధించాడు. సెమీస్‌లో ప్రపంచ నంబర్‌ 2 ఆటగాడు రఫెల్‌ నాదల్‌ను ఓడించిన అతడు తుదిపోరులో డొమినిక్‌ థీమ్‌ను ఓడించాడు. దీంతో కెరీర్‌లో తొలిసారి ఆ కప్పును సాధించాడు. నువ్వా.. నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో మెద్వెదెవ్‌ తొలి సెట్‌లో వెనుకంజలో పడ్డాడు. అయితే తర్వాతి రెండు సెట్లలో పుంజుకోవడంతో 4-6, 7-6, 6-4 తేడాతో గెలుపొందాడు. 

ఈ విజయంతో మెద్వెదెవ్‌ ఏటీపీ ఫైనల్స్‌ టోర్నీలో టాప్‌ మూడు ర్యాంకుల ఆటగాళ్లను ఓడించిన నాలుగో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అంతకు ముందు డేవిడ్‌ నాల్బాండియన్‌ (2007 మ్యాడ్రిడ్‌), నోవాక్‌ జకోవిచ్‌ (2007 మాంట్రియల్‌), బోరిస్‌ బెకర్‌ (1994 స్టాక్‌హోమ్‌) ఈ ఘనత సాధించారు. ‘ఈ విజయం సాధించడం గొప్పగా ఉంది. గ్రూప్‌ స్టేజ్‌లో జకోవిచ్‌ను, సెమీస్‌లో రఫెల్‌ను, ఇప్పుడు డొమినిక్‌ను ఓడించడం సంతోషంగా ఉంది. వీళ్లంతా టెన్నిస్‌ ప్రపంచంలో టాప్‌ ఆటగాళ్లు. నేనేంటో ఈ గెలుపుతో నిరూపితమైంది’ అని మెద్వెదెవ్‌ మ్యాచ్‌ అనంతరం పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని