కరోనా నిబంధనలు: వార్నర్‌కు షాక్‌

ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ భారత్‌తో జరిగే రెండో టెస్టుకు కూడా దూరంకానున్నాడు. తొడకండరాల గాయంతో ఇప్పటికే ఆఖరి వన్డే, టీ20 సిరీస్‌, తొలి టెస్టుకు అతడు దూరమైన సంగతి...

Updated : 23 Dec 2020 12:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ భారత్‌తో జరిగే రెండో టెస్టుకు కూడా దూరంకానున్నాడు. తొడకండరాల గాయంతో ఇప్పటికే ఆఖరి వన్డే, టీ20 సిరీస్‌, తొలి టెస్టుకు అతడు దూరమైన సంగతి తెలిసిందే. అయితే వార్నర్‌ పూర్తిగా కోలుకోవడానికి మరికాస్త సమయం పడుతుందని ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు (సీఏ) తెలిపింది. మరోవైపు పేసర్‌ సీన్‌ అబాట్‌ కూడా బాక్సింగ్ డే టెస్టుకు అందుబాటులో ఉండట్లేదని వెల్లడించింది. వీరిద్దరు సిడ్నీలో ఫిట్‌నెస్‌ మెరుగు కోసం సాధన చేశారు. కానీ, ఆ నగరంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో జట్టుకు దూరం కావాల్సివచ్చింది. 

‘‘వార్నర్‌, అబాట్‌ సిడ్నీలో బయోసెక్యూర్‌ వెలుపల ఫిట్‌నెస్‌ను మెరుగుపర్చుకున్నారు. న్యూసౌత్‌ వెల్స్‌లోని హాట్‌స్పాట్‌లో వారిద్దరు లేనప్పటికీ బాక్సింగ్ డే టెస్టు నాటికి జట్టులో చేరేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా బయోసెక్యూరిటీ నిబంధనలు అనుమతించవు’’ అని సీఏఓ ప్రకటనలో వెల్లడించింది. డిసెంబర్‌ 26 నుంచి మెల్‌బోర్న్‌ వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్టులో సీనియర్‌ ఆటగాడు‌ వార్నర్‌ లేకపోవడం ఆసీస్‌కు ప్రతికూలాంశమే. అతడి గైర్హాజరీతో జో బర్న్స్‌, మాథ్యూ వేడ్‌ రెండో టెస్టుకూ ఓపెనర్లగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

కాగా, అడిలైడ్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. రెండో టెస్టులో 36 పరుగులకే కుప్పకూలిన భారత క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో 0-1తో వెనుకంజలో ఉంది.

ఇదీ చదవండి

భారత క్రీడావివాదాలు @2020

ఓటమిని మరచి.. ముందుకెళ్లండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని