నెట్‌బౌలర్ నుంచి టీమ్ఇండియా పేసర్‌గా..
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ టి.నటరాజన్.. నెట్‌బౌలర్ నుంచి టీమ్ఇండియా పేసర్‌గా ఎదిగాడని ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రశంసించాడు...
ఇంటర్నెట్‌డెస్క్: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ టి.నటరాజన్.. నెట్‌బౌలర్ నుంచి టీమ్ఇండియా పేసర్ స్థాయికి ఎదిగాడని ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రశంసించాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన మూడు టీ20ల సిరీస్‌లో నటరాజన్ ఆరు వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సన్‌రైజర్స్ పేసర్ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు. మూడో టీ20 అనంతరం వార్నర్ ఇన్‌స్టాగ్రామ్‌లో నటరాజన్‌ను పొగుడుతూ ఓ పోస్టు చేశాడు. ఐపీఎల్లో తన సహచర ఆటగాడైన నటరాజన్.. భారత్-ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల క్రికెట్లో అదరగొట్టాడని, నెట్ బౌలర్‌గా ఈ పర్యటనకు ఎంపికై తర్వాత భారత్ తరఫున అరంగేట్రం చేశాడని సన్‌రైజర్స్ కెప్టెన్ మెచ్చుకున్నాడు.
క్రికెట్లో గెలుపోటములు పక్కనపెడితే టీమ్ఇండియా-ఆస్ట్రేలియా ఆటగాళ్లు పరస్పరం గౌరవించుకొంటారని వార్నర్ పేర్కొన్నాడు. తాము టీ20 సిరీస్ కోల్పోయినా నటరాజన్ ప్రదర్శన పట్ల ఎక్కువ సంతోషంగా ఉన్నట్లు తెలిపాడు. నటరాజన్ మంచి ఆటగాడని, ఈ సిరీస్‌ను ఆస్వాదించానని సన్‌రైజర్స్ కెప్టెన్ వివరించాడు. ఇదిలా ఉండగా.. నటరాజన్ తొలుత ఈ ఆస్ట్రేలియా పర్యటనకు నిజంగానే నెట్‌బౌలర్‌గా ఎంపికయ్యాడు. అయితే, టీమ్ఇండియా తొలి రెండు వన్డేల్లో అనూహ్యంగా ఓటమిపాలవ్వడంతో మూడో వన్డేలో నటరాజన్‌ను తుదిజట్టులోకి తీసుకున్నారు. అప్పుడతడు ఫర్వాలేదనిపించడంతో తర్వాత టీ20 సిరీస్‌కు ఎంపిక చేశారు. ఈ క్రమంలోనే తొలి మ్యాచ్‌లో మూడు వికెట్లు, రెండో మ్యాచ్‌లో రెండు, మూడో మ్యాచ్‌లో ఒక వికెట్ పడగొట్టాడు. మరోవైపు యూఏఈలో గతనెల పూర్తి అయిన 13వ సీజన్లోనూ మంచి ప్రదర్శనే చేశాడు. మొత్తం 16 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీసి సన్‌రైజర్స్ తరఫున రెండో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు.
ఇవీ చదవండి..
ధోనీకి యువీలా.. హార్దిక్‌కు మరొకరు అవసరం
గంగూలీ, షా కొనసాగింపుపై ఉత్కంఠ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్‌దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్‌కు వెళ్లి కెప్టెన్‌గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
క్వార్టర్స్‌లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్‌రైడర్స్ కోచ్
కోల్‌కతా నైట్‌రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్‌రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్‌ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్‌కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్‌కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్‌కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్‌కతా నైట్‌రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్