డివిలియర్స్‌ మెరుపులు.. దిల్లీ లక్ష్యం 153

దేవదత్‌ పడిక్కల్‌ (50; 41 బంతుల్లో, 5×4), డివిలియర్స్‌ (35; 21 బంతుల్లో, 1×4, 2×6) రాణించడంతో దిల్లీకి బెంగళూరు 153 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీసేన నిర్ణీత 20

Published : 02 Nov 2020 21:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేవదత్‌ పడిక్కల్‌ (50; 41 బంతుల్లో, 5×4), డివిలియర్స్‌ (35; 21 బంతుల్లో, 1×4, 2×6) రాణించడంతో దిల్లీకి బెంగళూరు 153 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీసేన నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. బెంగళూరుకు శుభారంభం దక్కలేదు. ఫిలిప్‌ (12; 17 బంతుల్లో, 1×4)ను రబాడ ఔట్‌ చేయడంతో 25 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్‌ కోహ్లీ (29; 24 బంతుల్లో, 2×4, 1×6)తో కలిసి పడిక్కల్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. వీరిద్దరు సమయోచితంగా ఆడుతూ రెండో వికెట్‌కు అర్ధశతక భాగస్వామ్యం నమోదు చేశారు. అయితే దూకుడుగా ఆడే క్రమంలో కోహ్లీ పెవిలియన్‌కు చేరాడు. అనంతరం పడిక్కల్‌, మోరిస్‌ (0) కూడా ఒకే ఓవర్‌లో వెనుదిరిగడంతో బెంగళూరు ఇబ్బందుల్లో పడింది.

ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన దూబె (17; 11 బంతుల్లో, 2×4, 1×6)తో కలిసి డివిలియర్స్‌ ఆదుకున్నాడు. తొలుత వీరిద్దరు నిదానంగా ఆడినా తర్వాత బౌండరీల మోత మోగించారు. డేనియల్‌ వేసిన 18వ ఓవర్‌లో వీరిద్దరు కలిసి ఒక సిక్సర్‌, రెండు బౌండరీలు బాదడంతో 17 పరుగులు వచ్చాయి. అయితే దూకుడుగా ఆడే క్రమంలో స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్‌కు చేరారు. దిల్లీ బౌలర్లలో నోర్జె మూడు, రబాడ రెండు, అశ్విన్ ఒక వికెట్ తీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని