బౌలింగ్‌ ఎంచుకున్న దిల్లీ

రసవత్తరంగా సాగుతున్న లీగ్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. దుబాయ్‌ వేదికగా దిల్లీ×హైదరాబాద్‌ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన దిల్లీ బౌలింగ్‌‌ ఎంచుకుంది. ఇరు జట్లు 11 మ్యాచ్‌లు ఆడగా ఏడు విజయాలతో దిల్లీ రెండో స్థానంలో, ఏడు పరాజయాలతో హైదరాబాద్‌

Updated : 27 Oct 2020 19:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రసవత్తరంగా సాగుతున్న లీగ్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. దుబాయ్‌ వేదికగా దిల్లీ×హైదరాబాద్‌ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన దిల్లీ బౌలింగ్‌‌ ఎంచుకుంది. ఇరు జట్లు 11 మ్యాచ్‌లు ఆడగా ఏడు విజయాలతో దిల్లీ రెండో స్థానంలో, ఏడు పరాజయాలతో హైదరాబాద్‌ ఏడో స్థానంలో నిలిచాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే దిల్లీ ప్లేఆఫ్ బెర్తు ఖరారు కానుంది. మరోవైపు ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే వార్నర్‌సేన ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాలి. అయితే టాప్‌-4లో హైదరాబాద్ నిలవాలంటే తర్వాతి మ్యాచ్‌ల్లో విజయం సాధించడంతో పాటు ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడి ఉంటుంది.

జట్ల వివరాలు:

దిల్లీ: శిఖర్‌ ధావన్‌, రహానె, శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్), పంత్‌, హెట్‌మైయర్‌, స్టాయినిస్, అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, రబాడ, నోర్జె, తుషార్‌ దేశ్‌పాండే

హైదరాబాద్‌: వార్నర్‌ (కెప్టెన్‌), విలియమ్సన్‌, మనీష్‌ పాండే, విజయ్‌ శంకర్, వృద్ధిమాన్‌ సాహా, హోల్డర్‌, అబ్దుల్‌ సమద్‌, రషీద్‌ ఖాన్‌, నదీమ్‌, సందీప్‌ శర్మ, నటరాజన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని