Published : 19 Aug 2020 01:40 IST

ప్రపంచకప్‌ విన్నింగ్‌ సిక్స్‌.. ధోనీకి ఆ సీట్‌ అంకితం!

ఇంటర్నెట్‌ డెస్క్‌: 2011 ప్రపంచకప్‌ ఫైనల్లో ధోనీ కొట్టిన విన్నింగ్ సిక్స్‌ క్రికెట్‌ ప్రేమికుల మదిలో చిరకాలం చిలిచి ఉంటుంది. ఆ గెలుపు జ్ఞాపకాలను మరింత పదిలం చేసేందుకు ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌ (ఎంసీఏ) సన్నాహాలు చేస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌కు ధోనీ వీడ్కోలు పలకడంతో అతడు సిక్స్‌ కొట్టి ప్రపంచకప్‌ గెలిపించిన ఆ మధుర క్షణాలను పదిలం చేయాలనుకుంటోంది. వాంఖడే స్టేడియంలో ఆ బాల్ పడిన సీట్‌తోపాటు ప్రాంతాన్ని అందంగా అంకరించాలనుకుంటోంది. ఎంసీఏ అపెక్స్‌ కౌన్సిల్ సభ్యుడు ఆజింక్య నాయక్‌ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఎంసీఏకు ఓ లేఖ రాశారు. భారత క్రికెట్‌కు ధోనీ చేసిన అపారమైన సేవలకు కృతజ్ఞతగా బాల్‌ పడిన సీట్‌ను ధోనీకి అంకితమివ్వాల్సిందిగా కోరారు. 

‘వాంఖడే స్టేడియంతో ధోనీకి ఉన్న బంధాన్ని తెలియజేస్తూ అతడు కొట్టిన ప్రపంచకప్‌ విన్నింగ్‌ సిక్స్‌ జ్ఞాపకాలను పదిలం చేయాలనుకుంటున్నాం. ఆ బాల్‌ పడిన ప్రాంతాన్ని గుర్తించి ఆ సీట్‌ను పెయింట్ వేసి అందంగా అలంకరిస్తాం. ఆ ప్రాంతాన్ని పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దాలనుకుంటున్నాం’ అని నాయక్‌ లేఖలో పేర్కొన్నారు.  భారత క్రికెట్‌కు అతడు అందించిన అపారమైన సేవలకు గాను ఆ సీట్‌కు ధోనీ పేరు పెట్టి అతడికి అంకితం ఇవ్వాలనుకుంటున్నాం అని తెలిపారు. ‘భారతీయ క్రికెట్‌ చరిత్రలోనే అత్యద్భుతమైన ఆ క్షణాలను అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా ఉంచాలనుకుంటున్నాం’ అని లేఖలో స్పష్టం చేశారు.
 

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts