రైనా.. షాహిద్‌ అఫ్రిదీలా చెయ్

ధోనీ రిటైర్మెంట్‌ ప్రకటించిన వెంటనే తాను కూడా వీడ్కోలు పలికిన సురేశ్‌ రైనా మరింత కాలం ఆడాల్సి ఉందని మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. అతడిది రిటైర్మెంట్‌ ప్రకటించే వయసు కాదన్నాడు...

Published : 21 Aug 2020 02:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ధోనీతో పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సురేశ్‌ రైనా మరింత కాలం ఆడాల్సి ఉందని మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు. అతడిది రిటైర్మెంట్‌ ప్రకటించే వయసు కాదన్నాడు. తాజాగా అతడిని యూట్యూబ్‌లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చాడు. ‘రైనా ఇంకా ఆడాల్సి ఉందా?’ అని అభిమాని అడగ్గా.. కచ్చితంగా అతడు చాలా ఆడాల్సి ఉందని, ఇప్పుడు వీడ్కోలు పలికే అవసరమే లేదని మాజీ క్రికెటర్‌ అభిప్రాయపడ్డాడు. రైనాకిప్పుడు 33 ఏళ్లే అని, అతడికి గాయాల సమస్యలున్నా.. ఏ ఆటగాడికి లేవని ప్రశ్నించాడు. సర్జరీ అయ్యాక అతడింకా అత్యుత్తమంగా తయారయ్యాడని, ఫిట్‌నెస్‌ విషయంలోనూ మెరుగయ్యాడని తెలిపాడు. 

అలాగే ధోనీ గురించి ప్రస్తావిస్తూ.. అతడిది వేరే పరిస్థితని ఆకాశ్ వ్యాఖ్యానించాడు. ఒకవేళ అనుకున్నట్లే ఐపీఎల్‌ ఏప్రిల్‌, మేలో జరిగి.. అక్టోబర్‌-నవంబర్‌లో టీ20 ప్రపంచకప్‌ జరిగి ఉంటే రిటైర్మెంట్‌ ప్రకటించకపోయేవాడని ఆకాశ్‌ చోప్రా అన్నాడు. అవి వాయిదా పడడంతోనే ఆ నిర్ణయం తీసుకున్నాడని అభిప్రాయపడ్డాడు. రైనాకు అలాంటి ఇబ్బందులేం లేవని, అతడు పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిదీలా రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోవాలని సూచించాడు. 2020, 2021 ఐపీఎల్‌ సీజన్లలో రాణిస్తే వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ జట్టులో అతడు చోటు దక్కించుకునేవాడని పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని