ధాటిగా ఆడటం ముఖ్యం కాదు: ధోనీ

పంజాబ్‌పై ఘన విజయం సాధించాక చెన్నై కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ మాట్లాడాడు. తన జట్టుపై నమ్మకముందని, ఈ మ్యాచ్‌లో చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకున్నామని

Published : 05 Oct 2020 01:16 IST

ఏ నిర్ణయం అయినా కలిసే తీసుకుంటాం..

ఇంటర్నెట్‌డెస్క్‌: పంజాబ్‌పై ఘన విజయం సాధించాక చెన్నై కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ మాట్లాడాడు. తన జట్టుపై నమ్మకముందని, ఈ మ్యాచ్‌లో చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకున్నామని చెప్పాడు. ఇన్ని రోజులు శుభారంభం కోసమే ఎదురు చూశామని, అక్కడే అనుభజ్ఞుల ఆట ఎంటో బయటపడుతుందని పేర్కొన్నాడు. విజయం సాధించడమంటే ధాటిగా ఆడటం కాదన్నాడు. ఇన్ని రోజులూ వాట్సన్‌ నెట్స్‌లో సాధన చేస్తున్నా మైదానంలో ఆ ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయాడని తెలిపాడు. ఒకసారి కుదురుకుంటే అతడు రెచ్చిపోతాడని మహీ అన్నాడు. అలాగే డుప్లెసిస్‌ తమ జట్టుకు ఆణిముత్యం అని, అతడెప్పుడూ తన షాట్లతో బౌలర్లను అయోమయానికి గురిచేస్తాడని వివరించాడు. 

కోచ్‌ ఫ్లెమింగ్‌పై స్పందించిన ధోనీ.. స్టీఫెన్‌కు దక్కాల్సిన గుర్తింపు దక్కలేదని చెప్పాడు. తామిద్దరం అన్ని విషయాలు చర్చించుకుంటామని, ఏ నిర్ణయమైనా తమ మధ్యే ఉంటుందని తెలిపాడు. అలాగే పంజాబ్‌పై చెన్నై బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారని, తాము అనుకున్న ప్రణాళిక ప్రకారమే రాణించారని మెచ్చుకున్నాడు. చివరగా వాట్సన్‌, డుప్లెసిస్‌ అద్భుతంగా ఆడారని, వారిద్దరూ తమవైన షాట్లతో అలరించారని కెప్టెన్‌ అన్నాడు. కాగా, చెన్నై ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడగా రెండు విజయం సాధించి మూడు ఓటమిపాలైంది. ఆరంభ మ్యాచ్‌లో ముంబైపై ఘన విజయం సాధించిన ధోనీసేన, తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌లు ఓటమిపాలై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఇప్పుడు పంజాబ్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని