అంటే.. స్మిత్‌కు కెప్టెన్సీ ఇస్తున్నట్టేనా?

తనకు తిరిగి సారథ్యం అప్పగించడంపై చర్చలు కొనసాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌స్మిత్‌ అన్నాడు. నాయకత్వ బాధ్యతలు ఇవ్వకపోయినా ఇప్పుడున్న స్థితిలో బాగానే ఉన్నానని పేర్కొన్నాడు. జట్టుకు ఏది మేలు చేస్తుందో దానికే కట్టుబడతానని వెల్లడించాడు.....

Published : 10 Dec 2020 22:46 IST

సారథ్యంపై చర్చలు జరిగాయన్న మాజీ సారథి

అడిలైడ్‌: తనకు తిరిగి సారథ్యం అప్పగించడంపై చర్చలు కొనసాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌స్మిత్‌ అన్నాడు. నాయకత్వ బాధ్యతలు ఇవ్వకపోయినా ఇప్పుడున్న స్థితిలో బాగానే ఉన్నానని పేర్కొన్నాడు. జట్టుకు ఏది మేలు చేస్తుందో దానికే కట్టుబడతానని వెల్లడించాడు.

2018, మార్చిలో ఆస్ట్రేలియా.. దక్షిణాఫ్రికాలో పర్యటించింది. అక్కడ బాల్‌ ట్యాంపరింగ్‌ చేశారని తేలడంతో కెప్టెన్‌ స్టీవ్‌స్మిత్‌, వైస్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌పై ఏడాది నిషేధం విధించారు. ఆ తర్వాత జట్టులోకి వచ్చినా నాయకత్వ బాధ్యతలు ఇవ్వలేదు. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఆరోన్‌ ఫించ్‌, సుదీర్ఘ ఫార్మాట్‌కు టిమ్‌ పైన్‌‌ సారథ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం పైన్‌కు 36 ఏళ్లు ఉండటంతో స్మిత్‌కు ఆ బాధ్యతలు అప్పగించే ప్రక్రియ జరుగుతోందని తెలిసింది.

‘నాయకత్వ బదిలీ గురించి చర్చలు కొనసాగుతున్నాయి. కెప్టెన్సీ, నా గురించి ప్రశ్నలు వచ్చినప్పుడు కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ జవాబిచ్చాడు. కచ్చితంగా ఇందుకు సంబంధించిన ప్రక్రియ అయితే జరగాల్సి ఉంది. జట్టుకు ఏది అత్యుత్తమమో దాన్ని ఆనందంగా చేస్తాను. ఇప్పుడు సౌకర్యంగానే ఉన్నాను’ అని స్మిత్‌ అన్నాడు. కాగా క్రికెట్‌ ఆస్ట్రేలియా కమిన్స్‌ను వైస్‌ కెప్టెన్‌, మార్నస్‌ లబుషేన్‌, ట్రావిస్‌ హెడ్‌ను భవిష్యత్తు నాయకులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. టీమ్‌ఇండియాతో రెండో టీ20లో కెప్టెన్‌ ఫించ్‌ గాయపడటంతో మాథ్యూవేడ్‌ తాత్కాలిక సారథిగా బాధ్యతలు నిర్వర్తించాడు. ‘స్మిత్‌ సారథిగా ఎంపికయ్యేంత వరకు ఒక ప్రక్రియ నడుస్తుంది’ అని కోచ్‌ లాంగర్‌ అప్పుడు చెప్పడం గమనార్హం.

ఇవీ చదవండి
‘కింగ్‌కోహ్లీ’.. భూమ్మీద బిజీ క్రికెటర్‌!
నెట్‌బౌలర్‌ నుంచి టీమ్‌ఇండియా పేసర్‌గా..

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని