కోహ్లీ టాస్‌ గెలిస్తే మ్యాచ్‌ గెలిచినట్లే..!

టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. అయితే, టెస్టుల్లో అతడు టాస్‌ గెలిచాక భారత్‌ మ్యాచ్‌ ఓడిపోయిన దాఖలాలు లేవు...

Published : 17 Dec 2020 11:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. అయితే, టెస్టుల్లో అతడు టాస్‌ గెలిచాక భారత్‌ మ్యాచ్‌ ఓడిపోయిన దాఖలాలు లేవు. దీంతో ఆ సెంటిమెంట్‌ ఈ పింక్‌బాల్‌ టెస్టులోనూ పునరావృతం అవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు. మొత్తం 21 సందర్భాల్లో టాస్‌ గెలిచిన కోహ్లీ అన్ని మ్యాచ్‌లు‌ గెలిచాడు. అలాగే విదేశాల్లోనూ ఈ విధంగా మంచి రికార్డు కొనసాగిస్తున్నాడు‌. అక్కడ 10సార్లు టాస్‌ గెలవగా 8 సార్లు టీమ్‌ఇండియా విజయం సాధించింది. దీంతో టెస్టుల్లో అతడు టాస్‌ గెలిస్తే దాదాపు మ్యాచ్‌ గెలిచినట్లేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

మరోవైపు కోహ్లీ ప్రస్తుత సిరీస్‌లో రికార్డుపై పై కన్నేశాడు. ఇప్పటికే గత పర్యటనలో రెండు టెస్టులు గెలుపొందిన అతడు ఇప్పుడిక మరో మ్యాచ్‌ గెలిస్తే ఆస్ట్రేలియాలో మూడు టెస్టులు గెలిచిన ఏకైక ఆసియా సారథిగా నిలుస్తాడు. ఇంతకుముందు టీమ్‌ఇండియా మాజీ సారథి బిషన్‌సింగ్‌ బేడీ 1977-78 సీజన్‌లో భారత్‌కు కంగారూ గడ్డపై రెండు విజయాలు అందించాడు. అలాగే పాకిస్థాన్‌ మాజీ సారథి ముస్తాక్‌‌ మహ్మద్‌ 1977, 1979లో ఒక్కో టెస్టు గెలుపొందాడు. ఆ తర్వాత కోహ్లీసేన 2018-19 సీజన్‌లో రెండు టెస్టుల్లో విజయం సాధించి సిరీస్‌ కైవసం చేసుకుంది. ఇప్పుడు కోహ్లీ తొలి టెస్టు తర్వాత భారత్‌కు తిరిగి పయనమవుతున్నందున ఈ మ్యాచ్‌లో గెలిస్తే కొత్త రికార్డు సృష్టిస్తాడు. 

ఇవీ చదవండి..

నయా భారత్‌కు నేను ప్రతినిధిని: కోహ్లీ

 

కోహ్లీ ‘అర్థరహితం’ × పైన్‌ ‘వెనకడుగు వేయం’


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు