Updated : 16/12/2020 15:04 IST

ప్రపంచకప్‌ కంటే అదే గొప్పది: కపిల్‌దేవ్‌

ఇంటర్నెట్‌డెస్క్: తమ బలాబలాల్ని అర్థం చేసుకుని ఆస్ట్రేలియా పిచ్‌లపై బంతులు సంధించాలని టీమిండియా పేసర్లకు దిగ్గజ క్రికెటర్, 1983 ప్రపంచకప్‌ విజేత కపిల్‌దేవ్ సూచించారు. ‘‘మన ఫాస్ట్‌బౌలర్లకు ఆసీస్‌ పిచ్‌లపై ఆడిన అనుభవం ఎక్కువగా లేదు. అక్కడ బౌన్స్ లభిస్తుందని షార్ట్‌ బంతులు విసరడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే మన పేస్ బలాల్ని అర్థం చేసుకుని బౌలింగ్ చేయాలి. మనకి ప్రస్తుతం ఉత్తమ బౌలింగ్ దళం ఉంది. కానీ మన బౌలర్ల కంటే ప్రత్యర్థి జట్టు బౌలర్లకి అక్కడి పరిస్థితులపై ఎంతో అవగాహన ఉంది’’ అని అన్నాడు. 

నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా గురువారం నుంచి ప్రారంభంకానున్న తొలి డే/నైట్‌ టెస్టులో ఆస్ట్రేలియాకే విజయావకశాలు ఎక్కువగా ఉన్నాయని కపిల్‌దేవ్ అభిప్రాయపడ్డాడు. ‘‘కచ్చితంగా ఆస్ట్రేలియాకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వారు స్వదేశంలో ఆడుతున్నారు. అదే భారత్‌లో ఆడితే కోహ్లీసేన 80 శాతం విజయం సాధిస్తుందని భావిస్తా. అంతేగాక, ఆసీస్‌ ఎన్నో డే/నైట్ టెస్టులు ఆడింది. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఎలా ఆడాలో వారికి బాగా తెలుసు’’ అని అన్నాడు.

1983లో ప్రపంచకప్‌ను ముద్దాడటం కంటే దేశం తరఫున తొలిసారి ప్రాతినిధ్యం వహించడమే తన జీవితంలో గొప్ప విషయమని కపిల్‌దేవ్‌ తెలిపాడు. ‘‘దేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన తొలిరోజే నా జీవితంలో గొప్ప విషయం. ప్రపంచకప్‌ను అందుకున్న క్షణాల కంటే వెయ్యి రెట్లు గొప్పది. ఎందుకంటే దేశం కోసం ఆడాలనేది నా కల. దాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఎంతో గర్వపడతా’’ అని అన్నాడు. 1978లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన కపిల్‌దేవ్ 1983లో దేశానికి తొలి ప్రపంచకప్‌ను అందించాడు. టోర్నీలో అండర్‌డాగ్స్‌లో బరిలోకి దిగిన టీమిండియా ఛాంపియన్‌గా నిలిచింది. ట్రోఫీని అందుకోవడంలో సారథిగా, ఆల్‌రౌండర్‌గా‌ కపిల్‌ కీలకపాత్ర పోషించాడు.

ఇదీ చదవండి

స్మిత్‌కు గాయం?ఆందోళనలో ఆసీస్‌!

అభిమానులకు శుభవార్త: యువీ రీఎంట్రీ

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని