సీఎస్కే తర్వాతి కెప్టెన్‌ ఎంపికలో ధోనీ..: బ్రావో

ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ తర్వాత చెన్నై సూపర్‌ కింగ్స్‌ను కూడా వీడే అవకాశం ఉంది...

Published : 07 Sep 2020 01:17 IST

ఎవరైనా ఆట నుంచి తప్పుకోవాల్సిందే..

(ఫొటో: సీఎస్కే ట్విటర్‌)

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ తర్వాత చెన్నై సూపర్‌ కింగ్స్‌ను కూడా వీడే అవకాశం ఉంది. ఈ విషయంపై స్పష్టత లేనప్పటికీ ఆ ఫ్రాంఛైజీకి తన తర్వాత.. ఎవరు కెప్టెన్‌గా ఉండాలనే అంశంపై తీవ్రంగా ఆలోచిస్తున్నాడని ఆ జట్టు ఆల్‌రౌండర్‌ డ్వేన్‌బ్రావో అన్నాడు. తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘ధోనీ తర్వాత సీఎస్కే జట్టు సారథి ఎవరు ఉండాలనే విషయంపై ఇప్పటికే కొద్ది రోజుల నుంచి ఆలోచిస్తున్నాడని తెలుసు. ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఆట నుంచి తప్పుకోవాలి. అయితే, ఎప్పుడు తప్పుకోవాలనేదే ముఖ్యమైన విషయం. తన తర్వాత కెప్టెన్సీ పగ్గాలను రైనాకు లేదా మరో యువ ఆటగాడికిచ్చే అవకాశం ఉంది’ అని బ్రావో వివరించాడు. అనంతరం ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌ రిటైర్మెంట్‌ గురించి స్పందించిన విండీస్‌ క్రికెటర్‌.. ఈ ప్రభావం ఐపీఎల్‌లో అతడి కెప్టెన్సీపై పడదన్నాడు. ఇతరుల గురించి అతడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మహీ వ్యవహార శైలిలో ఎటువంటి మార్పులు ఉండవని చెప్పాడు. ఇకపోతే చెన్నై జట్టు ఇటీవలే క్వారంటైన్‌ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ జట్టులో కరోనా బారిన ఆటగాళ్లు మినహా మిగతా అందరూ మైదానంలో తీవ్రంగా కష్టపడుతున్నారు. ధోనీ సైతం ప్రాక్టీస్‌ సెషన్లో సిక్సులతో అలరిస్తున్నాడు. దీంతో రాబోయే సీజన్‌లో అతడి నుంచి మంచి వినోదం ఆశించే అవకాశం ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని