WWE ‌స్టార్‌ ల్యూక్ ‌హార్పర్‌ మృతి

వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సూపర్‌ స్టార్‌ జాన్‌ హుబెర్‌ (41) ఆదివారం మృతి చెందారు. ఆయన్ను డబ్ల్యూడబ్ల్యూఈ అభిమానులకు ఆయన ల్యూక్‌హార్పర్‌గా సుపరిచితమే. ఆయన భార్య ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో హార్పర్‌ మృతి విషయాన్ని వెల్లడించారు.

Updated : 27 Dec 2020 14:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సూపర్‌ స్టార్‌ జాన్‌ హుబెర్‌ (41) ఆదివారం మృతి చెందారు. డబ్ల్యూడబ్ల్యూఈ అభిమానులకు ఆయన ల్యూక్‌హార్పర్‌గా సుపరిచితమే. హార్పర్‌ మృతి విషయాన్ని ఆయన భార్య ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో వెల్లడించారు. ఊపరితిత్తుల సమస్యతో హార్పర్‌ మరణించినా.. ఆయనకు కొవిడ్‌ నిర్ధారణ కాలేదని తెలిపారు. హార్పర్‌ 2019 చివర్లో డబ్ల్యూడబ్ల్యూఈను వీడి ఆల్‌ ఎలైట్‌ రెజ్లింగ్‌లో చేరారు. ఆయన మృతి పట్ల‌ పలువురు సంతాపం ప్రకటించారు.

‘‘జాన్‌ హుబెర్‌ మరణం విషాదానికి గురి చేసింది. ఆయన కుటుంబ సభ్యులకు, మిత్రులకు, అభిమానులకు సానుభూతి వ్యక్తం చేస్తున్నాం’’ అని డబ్ల్యూడబ్ల్యూఈ ట్వీట్‌ చేసింది. ర్యాండీ ఓర్టన్‌, షేమస్‌, ట్రిపుల్‌ హెచ్‌ వంటి డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌ స్టార్లు హార్పర్‌ మృతికి ట్విటర్‌లో సంతాపం వ్యక్తం చేశారు.

1979లో న్యూయార్క్‌లో జన్మించిన హ్యూబర్‌ రెజ్లర్‌గా 1990లో తన కెరీర్ ప్రారంభించారు. 2003లో రోచెస్టర్‌ ప్రోరెజ్లింగ్‌లో బ్రోడై లీ పేరుతో రింగ్‌లోకి దిగారు. 1995లో కెవిన్‌ స్మిత్‌ సినిమా మాల్‌రాట్స్‌లో ఓ పాత్ర పోషించారు. 2012లో డబ్ల్యూడబ్ల్యూఈతో ఒప్పందం చేసుకొని ల్యూక్‌హార్పర్‌గా పేరుమార్చుకొని బరిలోకి దిగారు. 2019 చివరి వరకు కొనసాగారు.

ఇవీ చదవండి

కోహ్లీ కన్నా బుమ్రాకే ఎక్కువ పారితోషికం

ఆస్ట్రేలియాపై పంత్‌ కొత్త రికార్డు..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని