
విహారిని ముందు పంపించాలి
దిల్లీ: ఆస్ట్రేలియాతో మిగిలిన టెస్టుల్లో హనుమ విహారిని బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుగా పంపించాలని.. విదేశాల్లో ఆడే టెస్టుల్లో సాహాకు బదులు పంత్‌కు తుది జట్టులో ప్రాధాన్యం ఇవ్వాలని సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. ‘‘హనుమ విహారి టెక్నిక్ చాలా మెరుగ్గా ఉంటుంది. తర్వాత జరిగే టెస్టుల్లో అతడిని నాలుగు లేదా అయిదో స్థానంలో ఆడించాలి. రాహుల్ ఆరో స్థానానికి సరిపోతాడు. కోహ్లి లేని సమయంలో కేఎల్ సత్తా చాటాల్సిన అవసరం ఉంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఆడేటప్పుడు వికెట్‌కీపర్‌గా పంత్‌కే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. భారత్ గడ్డపై ఆడేటప్పుడు ఆరో నంబర్ బ్యాట్స్‌మన్‌కు ఎక్కువ బ్యాటింగ్ చేసే అవకాశం రానప్పుడు.. స్పెషలిస్టు వికెట్‌కీపర్‌ను ఎంచుకోవచ్చు’’ అని ప్రసాద్ అన్నాడు.
ఇవీ చదవండి..
పెద్ద జట్లు.. చిన్న స్కోర్లు: ఎందుకీ విలవిల?
కిం కర్తవ్యం..!