పాండ్య, మోరిస్‌కు మందలింపు

ముంబయి ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య, బెంగళూరు ఆటగాడు క్రిస్‌ మోరిస్‌ను టీ20 లీగ్‌ యాజమాన్యం మందలించింది. వీరిద్దరూ గత మ్యాచ్‌లో లీగ్‌ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారు. మ్యాచ్‌లో 19వ ఓవర్‌ మోరిస్‌ వేశాడు. ఆ ఓవర్‌లో ఐదో బంతికి పాండ్య సిక్సర్‌ కొట్టాడు. వెంటనే..

Published : 29 Oct 2020 20:17 IST

(Photo: twitter)

ఇంటర్నెట్‌ డెస్క్‌: ముంబయి ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య, బెంగళూరు ఆటగాడు క్రిస్‌ మోరిస్‌ను టీ20 లీగ్‌ యాజమాన్యం మందలించింది. వీరిద్దరూ గత మ్యాచ్‌లో లీగ్‌ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారు. మ్యాచ్‌లో 19వ ఓవర్‌ మోరిస్‌ వేశాడు. ఆ ఓవర్‌లో ఐదో బంతికి పాండ్య సిక్సర్‌ కొట్టాడు. వెంటనే.. మోరిస్‌ను ఉద్దేశిస్తూ పాండ్య కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అయితే, ఆ తర్వాతి బంతికి పాండ్యను మోరిస్‌ ఔట్‌ చేసి అదే స్థాయిలో స్పందించాడు. దీంతో వీరిద్దరి మధ్య కొంతసేపు మాటల యుద్ధం జరిగింది. ఇది గమనించిన ఫీల్డ్‌ అంపైర్లు మ్యాచ్‌ ముగియగానే లీగ్‌ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు ఇద్దరు ఆటగాళ్లు ఒప్పుకొన్నారు. దీంతో లీగ్‌ యాజమాన్యం ఆ ఇద్దర్నీ మందలించి ఎటువంటి శిక్షా వేయకుండా వదిలేసింది.

(Photo: twitter)

బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబయి జట్టు బెంగళూరును 5 వికెట్ల తేడాతో ఓడించింది. 16 పాయింట్లు సాధించి ప్లేఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన బెంగళూరు తన తర్వాతి 2 మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే ప్లేఆఫ్స్‌ చేరుకోవచ్చు. ఈ మ్యాచ్‌లో అద్భుత అర్ధశతకం చేసిన సూర్యకుమార్‌ యాదవ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ లభించింది. కాగా.. ఈ మ్యాచ్‌లో పాండ్య 17 (15బంతుల్లో 2 సిక్సర్లు) పరుగులు, మోరిస్‌ 4 ఓవర్లలో ఒక వికెట్‌ తీసి 36 పరుగులు ఇచ్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని