ఒకే జట్టు తరఫున 150 మ్యాచ్‌లు..

కరోనా నేపథ్యంలో అబుదాబిలో జరుగుతున్న టీట్వంటీ మెగా ఈవెంట్‌లో బుధవారం ముంబయి, కోల్‌కతా జట్లు తలపడగా.. ముంబయి విజయం సాధించింది. ఈ మ్యచ్‌లో ముంబయి ఆటగాడు కీరన్‌ పోలార్డ్‌ అరుదైన.. 

Published : 25 Sep 2020 01:04 IST

అబుదాబి: కరోనా నేపథ్యంలో అబుదాబిలో జరుగుతున్న టీ20 మెగా ఈవెంట్‌లో బుధవారం ముంబయి, కోల్‌కతా జట్లు తలపడగా.. ముంబయి విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముంబయి ఆటగాడు కీరన్‌ పోలార్డ్‌ అరుదైన ఘనత సాధించారు. ఒకే జట్టు తరఫున 150 మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా అతనికి రికార్డు దక్కింది. ఈ టీ20 లీగ్‌ ప్రారంభమైన నాటి నుంచి ముంబయి జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న పోలార్డ్‌ కీలక సభ్యుడిగా ఎదిగాడు. క్లిష్ట సమయాల్లో చాలా మ్యాచ్‌లను గెలిపించాడు. ఇటువంటి ఈవెంట్లలో చాలా మందికి ఆడటానికి స్థానం దక్కని నేపథ్యంలో ఒకే జట్టుకు సేవలు అందిస్తూ రాణించటంపై ముంబయి కెప్టెన్‌ రోహిత్‌.. పోలార్డ్‌ను ప్రశసించాడు. 2013, 2019లో ఫైనల్‌ మ్యాచుల్లో ముంబయి గెలవటానికి ప్రధాన కారణం పోలార్డ్‌ అని గుర్తు చేసుకున్నాడు. ఈ జట్టులోని మరో ఆటగాడు హార్దిక్‌ పాండ్యా సైతం పోలార్డ్‌ను ప్రశంసించాడు. పోలార్డ్‌ను తన సోదరుడులాంటి వాడని చెప్పుకొచ్చిన పాండ్య.. ముంబయి తరఫున పోలార్డ్‌ 200 మ్యాచ్‌లు ఆడతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ టీ20 ఈవెంట్లో ఇప్పటి వరకూ 150 మ్యాచ్‌లు ఒకే జట్టు తరఫున ఆడిన ఆటగాళ్లలో కీరన్‌ పోలార్డ్ టాప్‌-5లో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని