కోహ్లీ, రహానె కెప్టెన్సీలో అదే తేడా: శాస్త్రి

టీమ్‌ఇండియా తాత్కాలిక కెప్టెన్‌ అజింక్య రహానె బ్యాటింగే బాక్సింగ్‌ డే టెస్టులో టర్నింగ్‌ పాయింటని హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి పేర్కొన్నాడు. రెండో టెస్టు అనంతరం అతడు మాట్లాడుతూ రహానెను...

Updated : 29 Dec 2020 15:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బాక్సింగ్‌ డే టెస్టులో టీమ్‌ఇండియా తాత్కాలిక కెప్టెన్‌ అజింక్య రహానె బ్యాటింగే ప్రధాన మలుపని హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి కొనియాడాడు. రెండో టెస్టు అనంతరం రహానెను రవిశాస్త్రి పొగడ్తలతో ముంచెత్తాడు. రహానె(112) తొలి ఇన్నింగ్స్‌లో శతకం బాదిన సంగతి తెలిసిందే. దాంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 131 పరుగుల ఆధిక్యం సంపాదించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను 200కే పరిమితం చేయడంతో.. భారత్‌ రెండు వికెట్లు కోల్పోయి 70 పరుగులను ఛేదించింది.

‘‘తొలి ఇన్నింగ్స్‌లో రహానె బ్యాటింగ్‌కు వెళ్లినప్పుడు టీమ్‌ఇండియా 60 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. విపత్కర పరిస్థితుల్లో 6 గంటలపాటు బ్యాటింగ్‌ చేయడం చాలా కష్టం. అయినా బాగా ఆడి శతకం బాదాడు. రహానె ఏకాగ్రత నమ్మశక్యం కానిది. ఈ మ్యాచ్‌లో అతడి బ్యాటింగే ప్రధాన మలుపు’’ అని శాస్త్రి వివరించాడు. అలాగే కోహ్లీ, రహానె కెప్టెన్సీలపై స్పందిస్తూ ఇద్దరూ ఆటను బాగా అర్థం చేసుకుంటారని, విరాట్‌ ఆటపట్ల దూకుడుగా ఉంటే.. రహానె ప్రశాంతంగా ఉంటాడన్నాడు. అది వారి స్వభావమని చెప్పాడు. అయితే, అజింక్య నిర్మలంగా ఉన్నా తనకేం కావాలో తెలుసని టీమ్‌ఇండియా కోచ్‌ పేర్కొన్నాడు.

ఇవీ చదవండి..
ఈ విజయం మధుర జ్ఞాపకం..!
రెండో టెస్టులో విజయం మనదే
ఒక రేంజ్‌ క్రికెటర్లు బాబూ..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని