బౌలింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌

టీ20 లీగ్‌లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. షార్జా వేదికగా బెంగళూరు×హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన హైదరాబాద్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు 12 మ్యాచ్‌లు ఆడగా కోహ్లీసేన

Updated : 31 Oct 2020 19:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 లీగ్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. షార్జా వేదికగా బెంగళూరు×హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన హైదరాబాద్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు 12 మ్యాచ్‌లు ఆడగా కోహ్లీసేన 7 విజయాలతో రెండో స్థానంలో, హైదరాబాద్‌ 10 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లేఆఫ్‌ బెర్తు ఖరారు చేసుకోవాలని బెంగళూరు భావిస్తోంది. మరోవైపు టాప్‌-4 రేసులో నిలవాలంటే వార్నర్‌సేన ఈ పోరులో తప్పక విజయం సాధించాలి.

జట్ల వివరాలు

బెంగళూరు: పడిక్కల్‌, ఫిలిప్‌, విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), ఏబీ డివిలియర్స్‌, గుర్‌కీరత్ సింగ్‌, వాషింగ్టన్‌ సుందర్, క్రిస్‌ మోరిస్‌, ఉదాన, సైని, సిరాజ్‌, చాహల్‌

హైదరాబాద్‌: వార్నర్‌ (కెప్టెన్‌), సాహా, మనీష్ పాండే, విలియమ్సన్‌, సమద్‌, అభిషేక్‌ శర్మ, హోల్డర్‌, రషీద్‌ ఖాన్‌, సందీప్‌ శర్మ, నదీమ్‌, నటరాజన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు