ప్రజలకు నేనెవరో తెలుసు.. అది చాలు : మిశ్రా

శ్రీలంక ఫాస్ట్‌ బౌలర్‌ లసిత్‌ మలింగ తర్వాత టీ20 లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన లెగ్ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా. మంగళవారం తన జట్టు దిల్లీ.. హైదరాబాద్‌తో పోటీ పడనున్న సందర్భంగా మీడియాతో.........

Published : 28 Sep 2020 22:53 IST

అబుదాబి: శ్రీలంక ఫాస్ట్‌ బౌలర్‌ లసిత్‌ మలింగ తర్వాత టీ20 లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన లెగ్ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా. మంగళవారం తన జట్టు దిల్లీ.. హైదరాబాద్‌తో పోటీ పడనున్న సందర్భంగా మీడియాతో ముచ్చటించాడు. క్రికెట్‌ ప్రయాణంలో ఆశించినంత దక్కకపోయినా.. ప్రస్తుతం తాను ఉన్న స్థానంతో సంతృప్తిగా ఉన్నట్లు వివరించాడు. ఓ లెగ్‌ స్పిన్నర్‌గా తానెవరో, తన ఆట ఏంటో ప్రజలకు తెలుసని.. అది తనకు చాలని మిశ్రా పేర్కొన్నాడు. టీమిండియా తరఫున ఆడటానికి తరచూ అవకాశాలు వస్తూపోతున్న సమయంలో కెరీర్‌ గురించి విపరీతంగా ఆలోచించేవాడినని, దాంతో క్రికెట్‌పై దృష్టి సారించలేకపోయానని తెలిపాడు. తర్వాత ఆలోచనలను వదిలేసి క్రికెట్‌ ప్రయాణంపై దృష్టి పెట్టినట్లు వివరించాడు.

అబుదాబి పిచ్‌ బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉంటుందని మిశ్ర అన్నాడు. పిచ్‌ స్లోగా ఉండటం వల్ల బ్యాట్స్‌మెన్‌ షాట్లు ఆడటానికి సమయం దొరుకుతుందన్నాడు. కోచ్‌ రికీ పాంటింగ్‌ గురించి మిశ్రా మాట్లాడుతూ.. చాలా కాలం పాటు క్రికెట్‌ ఆడటం వల్ల పాంటింగ్‌కు ఆటగాళ్ల మానసిక స్థితి బాగా తెలుసని వివరించాడు. ఎప్పుడూ పాజిటివ్‌గా ఆలోచించే పాటింగ్‌ ఒత్తిడిలో ఉన్న ఆటగాళ్లకు కొత్త బలాన్నిస్తాడని పేర్కొన్నాడు. లెగ్‌ స్పిన్నర్‌ బ్యాట్స్‌మెన్‌పై ఆధిపత్యం చెలాయిస్తాడనే మాటలతో తాను ఏకీభవించనని చెప్పాడు. భారత్‌ తరఫున 22 టెస్టులు, 36 వన్డేలు, 10 టీ20లు ఆడిన మిశ్రా 2016లో జరిగిన న్యూజిలాండ్‌ సిరీస్‌లో చివరిగా కనిపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని