
ఐసీసీ ప్రధాన కార్యాలయ సిబ్బందికి కరోనా
ఇంటర్నెట్ డెస్క్: దుబాయ్‌లోని ఐసీసీ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న పలువురు సిబ్బందికి కరోనా సోకింది. దీంతో అక్కడ జరుగుతున్న టీ20 లీగ్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి. అయితే వైరస్ సోకిన వారిని ఐసోలేషన్‌లో ఉంచినట్లు ఐసీసీ పేర్కొంది. టీ20 లీగ్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని స్పష్టం చేసింది. భారత్‌లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఈసారి దుబాయ్‌లో టీ20లీగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అక్కడ మూడు వేదికలు దుబాయ్, షార్జా, అబుదాబీ టోర్నీకి ఆతిథ్యమిస్తున్నాయి.
‘దుబాయ్‌లో ఉన్న అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న కొంతమందికి కరోనా సోకిన మాట వాస్తవమే. అయితే వారిని నిబంధనల ప్రకారమే ఇప్పటికే ఐసోలేషన్‌కు పంపించాము. వాళ్లతో కలిసిన వాళ్లను కూడా స్వచ్ఛందంగా ఐసోలేషన్‌లో ఉండాలని కోరాం. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం సౌకర్యం కూడా కల్పించాం. కరోనా ధరిచేరకుండా ఉండేందుకు అన్ని రకాలుగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇది టీ20 లీగ్‌ను ఏమాత్రం ప్రభావితం చేయదు’ అని ఐసీసీ ప్రతినిధి ఒకాయన వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.