భారత ఆటగాళ్లకు జరిమానా

ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టీ20లో స్లో ఓవర్‌ రేటు కారణంగా టీమిండియాకు ఐసీసీ జరిమానా విధించింది. ఇన్నింగ్స్‌ నిర్ణీత సమయంలో ఒక ఓవర్‌ ఆలస్యంగా పూర్తిచేయడంతో భారత ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో

Published : 09 Dec 2020 17:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టీ20లో స్లో ఓవర్‌ రేటు కారణంగా టీమిండియాకు ఐసీసీ జరిమానా విధించింది. ఇన్నింగ్స్‌ నిర్ణీత సమయంలో ఒక ఓవర్‌ ఆలస్యంగా పూర్తిచేయడంతో భారత ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తున్నట్లు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఆన్‌ ఫీల్డ్ అంపైర్లు రాడ్‌ టకర్, అబూడ్‌, టీవీ అంపైర్ పాల్‌ రీఫెల్‌, ఫోర్త్‌ అంపైర్‌ సామ్‌ ఫిర్యాదు మేరకు ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది.

‘‘ఐసీసీ ఆర్టికల్ 2.22 ప్రకారం నిర్దేశించిన సమయంలో బౌలింగ్ పూర్తి చేయనందుకు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించారు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ పొరపాటుని అంగీకరించడంతో దీనిపై విచారణ అవసరం లేదు’’ అని ఐసీసీ ప్రకటనలో తెలిపింది. సిడ్నీ వేదికగా మంగళవారం ఆసీస్‌తో జరిగిన ఆఖరి టీ20లో భారత్ 12 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలసిందే. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా 2-1తో ముగించింది. ఆస్ట్రేలియా సుదీర్ఘ పర్యటనలో భాగంగా డిసెంబర్ 17 నుంచి కోహ్లీసేన నాలుగు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. ఆడిలైడ్ వేదికగా తొలి డే/నైట్ టెస్టు జరగనుంది.

ఇదీ చదవండి

క్రికెట్‌కు పార్థివ్‌ పటేల్‌ గుడ్‌బై

టెస్టు సిరీస్‌కు ముందే ఆసీస్‌కు షాక్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని