ధోనీ.. బుల్లెట్‌ రైళ్లే ముందొస్తాయేమో..

భారత్‌లో బుల్లెట్ రైళ్ల కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాం.. చెన్నై జట్టు తరఫున ధోనీ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చేలా నిర్ణయం తీసుకునే ముందే అవి వచ్చేలా ఉన్నాయని

Published : 26 Sep 2020 23:49 IST

                                                                              బ్యాటింగ్‌ ఆర్డర్‌పై సెహ్వాగ్‌ వ్యాఖ్య

                                                  
దుబాయ్‌ : భారత్‌లో బుల్లెట్ రైళ్ల కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాం.. చెన్నై జట్టు తరఫున ధోనీ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చేలా నిర్ణయం తీసుకునే ముందే అవి వచ్చేలా ఉన్నాయని సెహ్వాగ్‌ చమత్కరించారు. శుక్రవారం జరిగిన టీట్వంటీ లీగ్‌ మ్యాచ్‌లో దిల్లీతో తలపడిన చెన్నై 44 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌ గురించి ఫేస్‌బుక్‌ వీడియోలో మాట్లాడిన సెహ్వాగ్‌.. ధోనీ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందు వస్తే ఫలితం మరోలా ఉండేదన్నారు. లక్ష్య ఛేదనలో 10 ఓవర్లకు 47 పరుగులే చేసి మూడు వికెట్లు కోల్పోయిన సమయంలో జాదవ్‌ బదులుగా ధోనీ వచ్చి ఉంటే బాగుండేదని సెహ్వాగ్‌ అభిప్రాయపడ్డారు. డుప్లెసిస్‌ ఒక్కడే జట్టులో బ్యాటింగ్‌ విభాగంలో ఒంటరి పోరు చేస్తున్నారని తెలిపారు. నిన్నటి మ్యాచ్‌లో చెన్నై జట్టు బ్యాటింగ్‌ తీరు టెస్టు మ్యాచ్‌ను తలపించిందని ఆయన అన్నారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని