ఫైనల్‌ రేసులో టీమిండియా ఉండాలంటే!

టెస్టు ఛాంపియన్‌షిప్‌ పోటీ రసవత్తరంగా మారింది. కరోనా కారణంగా పలు టెస్టు మ్యాచ్‌లు రద్దవ్వడంతో ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరే జట్లను పాయింట్ల ఆధారంగా కాకుండా గెలుపుశాతాన్ని

Published : 17 Dec 2020 01:21 IST

ఇంటర్నెట్‌డెస్క్: టెస్టు ఛాంపియన్‌షిప్‌ పోటీ రసవత్తరంగా మారింది. కరోనా కారణంగా పలు టెస్టు మ్యాచ్‌లు రద్దవ్వడంతో ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరే జట్లను పాయింట్ల ఆధారంగా కాకుండా గెలుపుశాతాన్ని బట్టి నిర్ణయిస్తామని ఐసీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌ను న్యూజిలాండ్‌‌ క్లీన్‌స్వీప్ చేయడంతో ఆ జట్టు భారత్‌కు గట్టి పోటీనిస్తోంది. స్వదేశంలో పాకిస్థాన్‌తో జరిగే టెస్టు సిరీస్‌లోనూ కివీస్‌‌ విజయం సాధిస్తే 420 పాయింట్లతో పాటు గెలుపుశాతం 70కి చేరుతుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా (296 పాయింట్లు, 82.22 %), భారత్ (360 పాయింట్లు, 75%) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.

కాగా, భారత్ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌ రేసులో ఉండాలంటే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌తో జరగనున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో అయిదు మ్యాచ్‌లు విజయం సాధించాలి లేదా నాలుగు విజయాలు, మూడు మ్యాచ్‌లు డ్రాగా ముగించాలి. ఫిబ్రవరిలో స్వదేశంలోనే ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ కాబట్టి భారత్‌ క్లీన్‌స్వీప్‌ కూడా సాధించవచ్చు. అయితే ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ టీమిండియా ఎలా ముగిస్తారనేది కీలకం. అక్కడ ఘోరంగా ఓటమిపాలైతే గెలుపుశాతంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

ఆసీస్ సిరీస్‌ను 2-2తో ముగించి, ఇంగ్లాండ్‌ సిరీస్‌ను 3-0తో గెలిస్తే భారత్‌ విజయశాతం 72.22కి చేరుతుంది. అదే ఆసీస్‌ సిరీస్‌ 1-1తో, ఇంగ్లాండ్‌ సిరీస్ 3-0తో ముగిస్తే గెలుపుశాతం 70.83గా నమోదవుతుంది. ఒకవేళ ఆసీస్‌ చేతిలో 1-3తో సిరీస్ కోల్పోయి ఇంగ్లాండ్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే, అలాగే ఆసీస్‌పై 2-1తో విజయం సాధించి, ఇంగ్లాండ్‌ను 2-0తో ఓడించినా... కోహ్లీసేన విజయశాతం 70.83 శాతంగా ఉంటుంది. అప్పుడు కివీస్‌ భారత్‌ను దాటే పరిస్థితి ఉండదు.

కానీ కంగారూల చేతిలో భారత్‌ 0-3తో ఓటమిపాలై, ఇంగ్లాండ్‌పై 4-0తో గెలిస్తే గెలుపుశాతం 68.06గా మారుతుంది. ఒకవేళ ఆసీస్‌ చేతిలో 1-2తో ఓటమిపాలై, ఇంగ్లాండ్‌పై 3-0తో గెలిస్తే విజయశాతం 69.44గా నమోదవుతుంది. ఈ సందర్భాల్లో పాయింట్ల పట్టికలో భారత్‌పై న్యూజిలాండ్‌ (పాక్‌పై కివీస్‌ గెలిస్తే) పైచేయి సాధిస్తుంది.

ఇదీ చదవండి

తొలి టెస్టు తుదిజట్టును ప్రకటించిన భారత్

ముళ్లను దాటి ‘గులాబీ’ని ముద్దాడేనా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని