Published : 26/12/2020 02:31 IST

పంత్‌, సాహా.. ఇద్దరికీ అన్యాయమే జరిగింది

రొటేషన్‌ పద్ధతిలో కీపర్లను ఎలా మారుస్తారన్న గంభీర్‌

ముంబయి: భారత క్రికెట్‌ జట్టు యాజమాన్యం ఆటగాళ్లలో అభద్రతాభావం పెంచుతోందని మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ అన్నాడు. రిషభ్ పంత్‌, వృద్ధిమాన్‌ సాహాను రొటేట్‌ చేయాలన్న నిర్ణయం ఆ ఇద్దరు వికెట్‌కీపర్లకు అన్యాయమేనని స్పష్టం చేశాడు. ఆసీస్‌తో తర్వాతి టెస్టుల్లో విఫలమైతే పంత్‌ను మళ్లీ తొలగిస్తారా అని ప్రశ్నించాడు. బాక్సింగ్‌డే టెస్టుకు ముందు గౌతీ మాట్లాడాడు.

‘ఇది దురదృష్టకరం. ఈ సిరీసులో వృద్ధిమాన్‌ సాహా ఒకే మ్యాచ్‌ ఆడాడు. అందులో బాగా ఆడలేదని జట్టు నుంచి తొలగించారు. మరి తర్వాతి రెండు మ్యాచుల్లో రిషభ్‌ పంత్‌ రాణించకపోతే అప్పుడేం చేస్తారు? మళ్లీ సాహా దగ్గరికెళ్తారా?’ అని గంభీర్‌ ప్రశ్నించాడు. మాటలతో ఆటగాళ్లలో భద్రతా భావం కలిగించలేరని, చేతల్లో మాత్రమే అది సాధ్యమవుతుందని అన్నాడు. ప్రస్తుత జట్టు యాజమాన్యం ఇందులో విఫలమవుతోందని విమర్శించాడు.

‘ప్రతి ఒక్కరూ అభద్రతాభావంతో ఉన్నారు కాబట్టే జట్టులో స్థిరత్వం లేదు. ప్రొఫెషనల్‌ క్రీడల్లో ఉండాల్సిందే భద్రత. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే వాళ్లు ప్రతిభావంతులే కదా. వాళ్లు కోరుకొనేది భద్రత. మీకు అండగా మేమున్నామనే హామీ. అదీ మాటల్లో కాదు చేతల్లో చూపించాలి. నిజం చెప్పాలంటే ఇప్పుడు తీసుకున్న నిర్ణయం పంత్‌, సాహా ఇద్దరికీ అన్యాయమే. ఎందుకంటే సుదీర్ఘకాలంగా వారిని పరిస్థితులను బట్టి తీసుకుంటున్నారు. కీపర్లను ఎవరూ అలా తీసుకోరు. సాధారణంగా బౌలర్లకు ఈ నియమం వర్తిస్తుంది. విదేశీ పిచ్‌లపై ఒక్కరు లేదా ఇద్దరు స్పిన్నర్లను ఆడిస్తున్నామంటే అర్థం చేసుకోగలరు. కానీ ప్రపంచంలో భారత్‌ తప్ప ఏ జట్టూ పరిస్థితులను బట్టి కీపర్లను మార్చదు. ఉపఖండంలో వృద్ధిమాన్ ‌సాహా, విదేశాల్లో పంత్‌ మెరుగన్న రొటేషన్‌ విధానాన్ని నేనస్సలు విశ్వసించను’ అని గంభీర్‌ ఘాటుగా చెప్పాడు.

ఇవీ చదవండి
కోహ్లీకి క్షమాపణలు చెప్పా: రహానె
టీమ్‌ఇండియా రెండో టెస్టు జట్టు ఇదే..

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని