గేల్‌ 99 ఔట్‌: జోఫ్రాకు ముందే తెలుసా?

క్రికెట్లో జోఫ్రా ఆర్చర్‌ను నోస్ట్రాడామస్‌గా పిలుస్తుంటారు. అతడు భవిష్యత్తులో జరిగే విషయాలను ముందుగానే ఊహించి ట్వీట్లు చేస్తుంటాడని అంటారు. యాదృచ్ఛికంగా అవి నిజమే అన్నట్టుగా ఉంటాయి. తాజాగా క్రిస్‌గేల్‌ను 99 పరుగుల...

Published : 01 Nov 2020 01:28 IST

సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన పాత ట్వీటు

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రికెట్లో జోఫ్రా ఆర్చర్‌ను నోస్ట్రాడామస్‌గా పిలుస్తుంటారు. అతడు భవిష్యత్తులో జరిగే విషయాలను ముందుగానే ఊహించి ట్వీట్లు చేస్తుంటాడని అంటారు. యాదృచ్ఛికంగా అవి నిజమే అన్నట్టుగా ఉంటాయి. తాజాగా క్రిస్‌గేల్‌ను 99 పరుగుల వద్ద ఔట్‌ చేస్తానని అతడికి ముందే తెలుసని సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 2013లో అతడు చేసిన ట్వీటును విపరీతంగా షేర్‌ చేస్తున్నారు నెటిజన్లు. 

అబుదాబి వేదికగా శుక్రవారం రాత్రి పంజాబ్‌, రాజస్థాన్‌ తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 185 పరుగులు చేసింది. ఆ జట్టులో క్రిస్‌గేల్‌ విధ్వంసకరంగా ఆడాడు. 8 సిక్సర్లు, 6 బౌండరీల సాయంతో 63 బంతుల్లోనే 99 పరుగులు చేశాడు. మైదానంలో బంతిని పరుగులు పెట్టించాడు. ఆర్చర్‌ వేసిన 19.3వ బంతిని సిక్సర్‌గా మలిచిన గేల్‌ 99 పరుగులకు చేరుకున్నాడు. మరో పరుగు చేస్తే శతకం. అలాంటింది ఆ తర్వాత బంతికే గేల్‌ను బౌల్డ్‌ చేశాడు ఆర్చర్‌. ఆవేశంలో బ్యాటు విసిరేసిన గేల్‌ ఆ తర్వాత ఆర్చర్‌తో చేయికలిపి పెవిలియన్‌ చేరాడు.

గేల్‌ను ఆర్చర్‌ 99 వద్ద ఔట్‌ చేయడంతో తాజాగా అతడు 2013లో చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. ‘నేను గనక బౌలింగ్‌ చేస్తే అతడు 100 పరుగులు చేయలేడని నాకు తెలుసు’ అన్న ట్వీట్‌ను అభిమానులు విపరీతంగా షేర్‌ చేస్తున్నారు. జోఫ్రాకు ఈ విషయం ముందే తెలుసని అంటున్నారు.


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు