బయో సెక్యూర్‌ నియమాలను ఉల్లంఘించిన ఆర్చర్‌

ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్‌ జట్టు ప్రముఖ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ను దూరం పెట్టింది. తొలి టెస్టు పూర్తయ్యాక అతడు జట్టు ఆదేశాలను బేఖాతరు చేసి బయో సెక్యూర్‌ నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించాడు.

Published : 17 Jul 2020 01:31 IST

కీలకమైన రెండో టెస్టుకు దూరమైన ఇంగ్లాండ్‌ పేసర్‌

మాంచెస్టర్‌: ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్‌ జట్టు ప్రముఖ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ను దూరం పెట్టింది. తొలి టెస్టు పూర్తయ్యాక అతడు జట్టు ఆదేశాలను బేఖాతరు చేసి బయో సెక్యూర్‌ నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించాడు. దీంతో ఇంగ్లాండ్‌ బోర్డు అతడిని రెండో టెస్టుకు కొద్ది గంటల ముందు ఆడనివ్వడం లేదని స్పష్టం చేసింది. 

సౌథాంప్టన్‌ టెస్టులో ఇంగ్లాండ్‌ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌ అనంతరం ఆటగాళ్లను తమ సొంత కార్లలో నేరుగా మాంచెస్టర్‌కు వెళ్లమని చెప్పగా ఆర్చర్‌ ఆ నిబంధనల్ని పాటించకుండా ఇంటికి వెళ్లినట్లు ఈసీబీ గుర్తించింది. దీంతో అతడు బయోసెక్యూర్‌ నియమాలను ఉల్లంఘించి రెండో టెస్టుకు దూరమయ్యాడు. ఇప్పుడతడు ఐదు రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో రెండు సార్లు కరోనా పరిక్షలు నిర్వహిస్తారని తెలిసింది. ఆయా పరీక్షల్లో నెగిటివ్‌గా నిర్ధారణ అయితేనే అతడు తర్వాతి మ్యాచ్‌లో ఆడే అవకాశం నెలకొంది. ఈ విషయాన్ని విండీస్‌ యాజమాన్యానికి కూడా తెలియజేసినట్లు ఇంగ్లాండ్‌ బోర్డు వెల్లడించింది. ఈ విషయంపై స్పందించిన ఆర్చర్‌ తాను నిజంగానే ప్రస్తుత నిబంధనలను ఉల్లంఘించానని అంగీకరించాడు. అందుకు క్షమాపణలు కూడా చెప్పాడు. తన ప్రవర్తనతో జట్టు మొత్తాన్ని ప్రమాదంలో పెట్టానని వాపోయాడు. తనపై విధించిన ఆంక్షలను పాటిస్తానని, మనస్ఫూర్తిగా అందరికీ క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నాడు. 

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని