ఆ ఫ్యామిలీని త్వరలోనే కలుస్తా: కపిల్‌దేవ్‌

ఇటీవల గుండెపోటుతో ఆస్పత్రి పాలై కోలుకున్న టీమిండియా మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ తొలిసారి అభిమానుల ముందుకొచ్చారు. తన ఆరోగ్యం బాగుందని వెల్లడించారు. తన ఆరోగ్యం మెరుగపడాలని.........

Updated : 29 Oct 2020 19:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల గుండెపోటుతో ఆస్పత్రి పాలై కోలుకున్న టీమిండియా మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ తొలిసారి అభిమానుల ముందుకొచ్చారు. తన ఆరోగ్యం బాగుందని వెల్లడించారు. తన కోసం ప్రార్థించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 1983లో ప్రపంచకప్‌ సాధించిపెట్టిన తన జట్టు (ఫ్యామిలీ) సభ్యులను కలవాలని ఉందని పేర్కొంటూ ఓ వీడియోను విడుదల చేశారు. 1983 వరల్డ్‌కప్‌ టీమ్‌ సభ్యుల వాట్సాప్‌ గ్రూప్‌లో దీన్ని పోస్ట్‌ చేశారు.

‘‘నా ఫ్యామిలీ 83. మిమ్మల్ని త్వరగా కలవాలని ఆతృతగా ఉంది. నేను బాగానే ఉన్నాను. నా ఆరోగ్యం కోసం ప్రార్థించిన అందరికీ కృతజ్ఞతలు. అతి త్వరలోనే అందరినీ కలుసుకుంటానని భావిస్తున్నా. సినిమా ఎప్పుడు విడుదలవుతుందో నాకు తెలియదు.. కానీ మిమ్మల్ని సాధ్యమైనంత త్వరలో కలిసేందుకు ప్రయత్నిస్తా. ఈ సంవత్సరం చివరకు వచ్చేశాం. తర్వాతి ఏడాది గొప్పగా ప్రారంభమవుతుందనే విశ్వాసం నాకు ఉంది. లవ్‌ యూ ఆల్‌’’ అని 29 సెకెన్ల పాటు ఉన్న ఈ  వీడియోలో పేర్కొన్నారు. 

1983 ప్రపంచకప్‌ హీరో, టీమ్‌ఇండియా మాజీ సారథి కపిల్‌ దేవ్‌ గత గురువారం గుండెపోటుకు గురై ఆస్పత్రిపాలైన సంగతి తెలిసిందే. దిల్లీలోని ఫోర్టీస్‌ ఆస్పత్రిలో చేరిన 61 ఏళ్ల కపిల్‌ దేవ్‌కు వైద్యులు యాంజియోప్లాస్టీ సర్జరీ నిర్వహించారు. అనంతరం ఆయన కోలుకోవడంతో ఆదివారం డిశ్చార్జి చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని