కోహ్లీ, ధోనీకి ప్రతిష్ఠాత్మక అవార్డులు

ఐసీసీ ప్రకటించిన ఈ దశాబ్దపు అత్యుత్తమ ఆటగాళ్ల అవార్డుల్లో భారత సారథి విరాట్ కోహ్లీదే హవా. ఈ దశాబ్దపు ఐసీసీ అత్యుత్తమ ప్లేయర్‌గా ఎంపికైన కోహ్లీకి ‘సర్‌ గార్ఫీల్డ్‌ సోబర్స్‌’ అవార్డు లభించింది. అంతేగాక ఈ దశాబ్దపు...

Updated : 28 Dec 2020 17:41 IST

ప్రకటించిన ఐసీసీ

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐసీసీ ప్రకటించిన ఈ దశాబ్దపు అత్యుత్తమ ఆటగాళ్ల అవార్డుల్లో భారత సారథి విరాట్ కోహ్లీదే హవా. ఈ దశాబ్దపు ఐసీసీ అత్యుత్తమ ప్లేయర్‌గా ఎంపికైన కోహ్లీకి ‘సర్‌ గ్యారీఫీల్డ్‌ సోబర్స్‌’ అవార్డు లభించింది. అంతేగాక ఈ దశాబ్దపు ఉత్తమ వన్డే ఆటగాడిగా నిలిచాడు. మరోవైపు మాజీ సారథి ఎంఎస్‌ ధోనీకి ఈ దశాబ్దపు ఐసీసీ స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌ అవార్డు దక్కింది. 2011లో ఇంగ్లాండ్‌తో జరిగిన నాటింగ్‌హామ్‌ టెస్టులో ఇయాన్‌ బెల్‌ రనౌట్‌పై ధోనీ ప్రదర్శించిన క్రీడా స్ఫూర్తికి ఈ అవార్డు లభించిందని ఐసీసీ తెలిపింది. కాగా, ప్రతిష్ఠాత్మక 2011 వన్డే ప్రపంచకప్‌, 2013 ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ, 2018-19 ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ సత్తాచాటడం, 70 శతకాలతో అదరగొట్టడం.. కోహ్లీని ఈ దశాబ్దపు అత్యుత్తమ ఆటగాడిగా నిలిచేలా చేశాయని వెల్లడించింది.

ఈ దశాబ్దపు ఐసీసీ టెస్టు అత్యుత్తమ ఆటగాడిగా ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్ స్మిత్‌ నిలిచాడు. అలాగే టీ20 ఫార్మాట్‌లో అఫ్గానిస్థాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌కు అవార్డు లభించింది. మహిళల విభాగంలో ఆస్ట్రేలియా క్రికెటర్‌ అలిసా పెర్రీ ఆధిపత్యం చెలాయించింది. ఈ దశాబ్దపు అత్యుతమ మహిళా క్రికెటర్‌గా అలిసా.. రాచెల్ హేహ ఫ్లింట్‌ ఐసీసీ ఉమెన్స్‌ అవార్డు పొందింది. అంతేగాక ఈ దశాబ్దపు వన్డే, టీ20 ప్లేయర్‌గా నిలిచింది. కాగా, నామినేటెడ్‌ ప్లేయర్లలో అత్యధిక ఓట్లు సాధించిన ఆటగాళ్లకు ఐసీసీ ఈ అవార్డులను ప్రదానం చేసింది.

ఇదీ చదవండి

ఆధిపత్యం ఇలాగే ఉంటే.. విజయం మనదే 

రాహులో రాహులా.. 2020 సూపర్‌ హిట్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని