బ్యాటింగ్‌ ఎంచుకున్న కోల్‌కతా

అభిమానులకు ఎంతో వినోదాన్ని పంచుతున్న టీ20 లీగ్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. అబుదాబి వేదికగా జరుగుతున్న 24వ మ్యాచ్‌లో పంజాబ్‌, కోల్‌కతా జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన కోల్‌కతా బ్యాటింగ్‌ ఎంచుకుంది. చెన్నైపై విజయం సాధించిన కోల్‌కతా

Updated : 10 Oct 2020 15:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అభిమానులకు ఎంతో వినోదాన్ని పంచుతున్న టీ20 లీగ్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. అబుదాబి వేదికగా జరుగుతున్న 24వ మ్యాచ్‌లో పంజాబ్‌, కోల్‌కతా జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన కోల్‌కతా బ్యాటింగ్‌ ఎంచుకుంది. చెన్నైపై విజయం సాధించిన కోల్‌కతా ఈ పోరులో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి టాప్‌-4లో తమ స్థానాన్ని కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు.. ఆరు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన పంజాబ్‌కు ఈ మ్యాచ్‌ ఎంతో కీలకం కానుంది. సీజన్‌ ముగింపులో ప్లేఆఫ్‌ అవకాశాలు సంక్లిష్టంగా కాకుండా ఉండాలంటే ఆ జట్టు గెలుపుబాట పట్టాల్సిన పరిస్థితి. ఈ మ్యాచ్‌లోనూ క్రిస్‌ గేల్ బరిలోకి దిగట్లేదు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు అతడు ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు.

జట్ల వివరాలు

పంజాబ్‌: మయాంక్‌ అగర్వాల్‌, కేఎల్ రాహుల్ (కెప్టెన్), నికోలస్‌ పూరన్‌, సిమ్రాన్‌ సింగ్‌, మన్‌దీప్‌ సింగ్‌, మాక్స్‌వెల్, ముజీబ్‌ రెహ్మాన్‌, క్రిస్ జోర్డాన్‌, అర్షదీప్‌ సింగ్‌, రవి బిష్ణోయ్‌, షమి

కోల్‌కతా: రాహుల్ త్రిపాఠి, శుభ్‌మన్‌ గిల్, నితీశ్‌ రాణా, మోర్గాన్‌, దినేశ్‌ కార్తిక్‌ (కెప్టెన్), రసెల్‌, నరైన్‌, కమిన్స్‌, నాగర్‌కోటి, ప్రసిధ్‌ కృష్ణ, వరుణ్‌ చక్రవర్తి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని